Google షాకింగ్ నిర్ణయం: ఇక కాల్ రికార్డ్ చేయడం కుదరదు
Google shocking decision: Could no longer record call: దిగ్గజ సెర్చింజన్ సంస్థ Google సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్లో గోప్యత, భద్రతను నిర్ధారించడానికి, వినియోగదారులకు కాల్ రికార్డింగ్ ఫీచర్లను అందించకుండా అప్లికేషన్లను నిరోధించడానికి Google కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇటీవల తన Play Store పాలసీకి కొన్ని మార్పులను చేసి, డెవలపర్ విధానాలను అప్డేట్ చేసింది. ఈ మార్పులు మే 11 నుంచి అమల్లోకి వస్తాయి. Play Store లో చాలా కాల్ రికార్డింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని వినియోగదారుల గోప్యతను పాటించడం లేదు, అలాగే వ్యక్తిగత సమాచారానికి ఈ యాప్స్ యాక్సెస్ పొందుతున్నాయి. అందుకే Play Store లో కాల్ రికార్డింగ్ కోసం యాక్సెసిబిలిటీ APIని ఉపయోగించడానికి యాప్ డెవలపర్లు ఇకమీదట అనుమతించబడరు.కాల్ రికార్డింగ్ను నిలిపివేయడానికి గూగుల్ ఇంతకుముందు ఆండ్రాయిడ్ 6లో రియల్ టైమ్ కాల్ రికార్డింగ్ను బ్లాక్ చేసింది. ఆండ్రాయిడ్ 10తో, గూగుల్ తన డివైజ్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ను పూర్తిగా తీసివేసింది. అయినప్పటికీ, కొన్ని యాప్లు Play Storeలో ఉన్నాయి. "కాల్ రికార్డింగ్ యాప్ ఫోన్లో డిఫాల్ట్గా ఉంటే, ఇన్కమింగ్ ఆడియో స్ట్రీమ్కు యాక్సెస్ పొందడానికి యాక్సెసిబిలిటీ సామర్థ్యం అవసరం లేదు" అని డెవలపర్ వెబ్నార్లో పేర్కొన్నారు. Android 10లో, Google కాల్ రికార్డింగ్ని డిఫాల్ట్గా బ్లాక్ చేసింది.
COMMENTS