Exciting new features with Truecaller update:Truecaller అప్డేట్ తో అదిరే కొత్త ఫీచర్లు
Exciting new features with Truecaller update: స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే మరియు ప్రముఖ యాప్ Truecaller కొత్త అప్డేట్ తెచ్చింది. ఈ అప్డేట్ తో యూజర్లకు బాగా ఉపయోగపడే మంచి ఫీచర్లను కూడా చేసింది. ఈ లేటెస్ట్ అప్డేట్ ద్వారా గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ ఫీచర్ తో పాటుగా మరికొన్ని అవసరమైన ఫీచర్లను కూడా అందించింది. ట్రూకాలర్ కొత్త అప్డేట్ తో అందించిన ఆ కొత్త ఫీచర్లు ఏమిటో మీకు ఏవిధంగా ఉపయోగపడతాయి అనే పూర్తి విషయాలను చూద్దాం.
ట్రూకాలర్ కొత్త అప్డేట్ తో మూడు కొత్త ఫీచర్లను అందుకుంటారు. వీటిలో మొదటిది గ్రూప్ కాలింగ్ ఫీచర్. ఈ ఫీచర్ తో మీరు ఒకేసారి 8 మందితో గ్రూప్ కాలింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదిమాత్రమే కాదు, మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేనివారిని కూడా మీ గ్రూప్ వాయిస్ లో తీసుకొని మాట్లాడే అవకాశం వుంది. అంతేకాదు, మీరు గ్రూప్ కాల్ లోకి తీసుకోవాలనుకున్న వ్యక్తి ఇతర కాల్ లో ఉన్నా లేక ఆఫ్ లైన్ లో ఉన్నట్లయితే వారికీ నోటిఫికేషన్ కూడా పంపుతుంది.
ఇక రెండవ ఫీచర్, ఈ ఫీచర్ మీ ఫోన్ స్టోరేజ్ మరియు సమయాన్ని సేవ్ చేస్తుంది. ఎలాగంటే, మీకు ఉపయోగం లేదని లేదా పనికి రాని SMS లను మరియు OTP తో సహా పాత మెసేజ్ లను హైలెట్ చేసి చూపిస్తుంది. అలాగే, మీకు ఉపయోగపడే SMS లను మాత్రం సపరేట్ చేస్తుంది. మీకు ఉపయోగం లేని మెసేజ్ లను ఒకేసారి డిలీట్ చేయవచ్చు. దీనితో మీకు స్టోరేజ్ మరియు టైం రెండు కలిసి రావడమే కాకుండా, లేటెస్ట్ మెసేజ్ లు మాత్రమే మీకు కనిపిస్తాయి. ఈ ఫీచర్ ను ఇన్ బాక్స్ క్లియర్ ఫీచర్ గా పరిచయం చేసింది.
COMMENTS