ల్యాప్టాప్ లేదా PCలో స్క్రీన్షాట్లను సులభంగా షార్ట్కట్ కీలతో తీయడం ఎలా?2022
How to easily take screenshots with shortcut keys on laptop or PC? : కరోనా రావడంతో ప్రపంచం మొత్తం మీద ప్రజలు తమ యొక్క కార్యకలాపాలను నిర్వహించడం కోసం అధికంగా ఆన్లైన్ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో మీ పనిని క్యాప్చర్ చేయడానికి మీరు మీ ల్యాప్టాప్లో స్క్రీన్షాట్లను తీసుకోవలసిన అవసరం అనేక చోట్ల ఉంది.
స్క్రీన్షాట్ అనేది మీ యొక్క స్క్రీన్పై ఉన్న వాటి నుండి తీసిన స్టిల్ ఇమేజ్. మీరు దీని సాయంతో స్క్రీన్పైన ఉన్న ప్రతిదాని యొక్క స్టిల్స్ను క్యాప్చర్ చేయవచ్చు మరియు తర్వాత ఉపయోగం కోసం వాటిని JPG లేదా PNG ఫైల్లుగా సేవ్ చేయవచ్చు. విండోస్ మరియు macOS తో రన్ అయ్యే ల్యాప్టాప్లు రెండూ కూడా స్క్రీన్షాట్ను క్యాప్చర్ చేయడానికి కొన్ని త్వరిత మార్గాలు ఉన్నాయి. ల్యాప్టాప్లో స్క్రీన్షాట్ తీయడానికి గల మార్గాల గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
విండోస్ ల్యాప్టాప్లో స్క్రీన్షాట్ తీసుకోనే విధానం:
విండోస్ 10 మరియు విండోస్ 7 తో రన్ అయ్యే ల్యాప్టాప్లు ఏదైనా స్క్రీన్షాట్ను క్యాప్చర్ చేయడానికి 'స్నిప్పింగ్ టూల్' అనే ప్రత్యేక అప్లికేషన్తో వస్తాయి. ఈ యాప్ సాయంతో స్క్రీన్షాట్ తీసి మీ డివైస్ లో ఇమేజ్ ఫైల్గా సేవ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.
స్టెప్ 1: విండోస్ సెర్చ్ బాక్స్లో స్నిప్పింగ్ టూల్ కోసం సెర్చ్ చేసి దాన్ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: స్క్రీన్షాట్ను క్యాప్చర్ చేయడానికి 'న్యూ' ట్యాప్పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు స్క్రీన్షాట్ను ఎక్కడ నుండి ప్రారంభించాలనుకుంటున్నారో అక్కడ నుండి క్రాస్ ఎయిర్ని తరలించి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కిందికి లాగండి.
స్టెప్ 4: తర్వాత స్క్రీన్షాట్ను సేవ్ చేయడానికి 'సేవ్ స్నిప్' ఎంపిక మీద క్లిక్ చేయండి.
విండోస్ ల్యాప్టాప్లో షార్ట్కట్ కీలను ఉపయోగించి స్క్రీన్షాట్లను తీసే విధానం:
** స్క్రీన్షాట్ను క్యాప్చర్ చేయడానికి సులభమైన మార్గం విండోస్ కీ + 'PrtScn' (PrintScreen) బటన్ను కలిపి నొక్కడం. ఇది ఫంక్షన్ కీల పై వరుసలో ఉంటుంది. తరువాత సేవ్ బాక్స్ కనిపిస్తుంది. ఇమేజ్కి ఫైల్ పేరుని ఇచ్చి మీకు కావలసిన చోట సేవ్ చేయవచ్చు.
** స్క్రీన్పై నిర్దిష్ట భాగాన్ని క్యాప్చర్ చేయడానికి గల మరొక సులభమైన మార్గం Windows + Shift+S మూడు కీలను కలిపి నొక్కడం. ఇలా నొక్కడంతో స్క్రీన్ను మసకబారుతుంది. మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న భాగాన్ని ఎంచుకోవడానికి మౌస్ పాయింటర్ను డ్రాగ్ చేస్తూ ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్క్రీన్షాట్ క్లిప్బోర్డ్కు కాపీ చేయబడుతుంది.
** ఒకవేళ మీరు స్క్రీన్షాట్ను క్లిప్బోర్డ్కి కాపీ చేయకూడదనుకుంటే కనుక దాన్ని ఇమేజ్ ఫైల్గా సేవ్ చేయడానికి మీరు మీ Windows ల్యాప్టాప్లో షార్ట్కట్ కమాండ్ Windows key+PrtScnని ఉపయోగించవచ్చు. ఈ కీలను నొక్కితే స్క్రీన్షాట్ తీసి 'పిక్చర్స్' ఫోల్డర్లో సేవ్ చేయబడుతుంది.
** Windows+G ఎంపిక గేమర్లలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఎంపికలను ఎంచుకున్న తరువాత కెమెరా చిహ్నంపై క్లిక్ చేయండి లేదా స్క్రీన్షాట్ తీయడానికి Windows కీ+Alt+PrtScn నొక్కండి.
MacOS ల్యాప్టాప్లలో స్క్రీన్షాట్ తీసే విధానం:
** macOS ల్యాప్టాప్లు స్క్రీన్షాట్ తీయడానికి అనేక రకాల ఎంపికలను కూడా కలిగి ఉంటాయి. MacOS ల్యాప్టాప్లో స్క్రీన్షాట్ తీయడానికి సులభమైన మార్గం Command+Shift+3ని నొక్కడం. ఈ మూడు కీలను కలిపి నొక్కడం వలన స్క్రీన్ మొత్తం స్టిల్ క్యాప్చర్ చేయబడుతుంది.
** Command+Shift+4 అనేది స్క్రీన్లోని నిర్దిష్ట భాగాన్ని క్యాప్చర్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే అధునాతన కమాండ్.
** Command+Shift+5 అనే కీలను ప్రారంభించడం ద్వారా మీరు macOS ల్యాప్టాప్లలో స్క్రీన్షాట్ను సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. ఇది మీకు స్క్రీన్షాట్పై స్వేచ్ఛను ఇస్తుంది. మీరు కేవలం 'ఎంటర్' కీని నొక్కవచ్చు లేదా దిగువన ఉన్న చిన్న ప్యానెల్ నుండి 'ఎంపిక చేసిన భాగాన్ని క్యాప్చర్ చేయి' ఎంపికను ఎంచుకోవచ్చు.
** అదేవిధంగా కమాండ్+షిఫ్ట్+6 ఎంపిక మాత్రం టచ్ బార్తో కూడిన మ్యాక్బుక్ వెర్షన్కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. MacOS ల్యాప్టాప్లలో తీసిన అన్ని స్క్రీన్షాట్లు డిఫాల్ట్గా మీ డెస్క్టాప్లో స్టోర్ చేయబడతాయి.
COMMENTS