Appointment of Collectors and SPs for new districts in APఏపీలో
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు సోమవారం(ఏప్రిల్ 4) నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలలో 9 మందిని అదే స్థానంలో కొనసాగించారు. నలుగురికి స్థాన చలనం కలిగింది.
కలెక్టర్లు వీరే..
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీరావు, విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారి, మన్యం(పార్వతీపురం) జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్, విశాఖ జిల్లా కలెక్టర్గా మల్లికార్జున, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్గా రవి సుభాష్, కాకినాడ జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లా, తూ.గో. జిల్లా కలెక్టర్గా మాధవీలత, కోనసీమ జిల్లా కలెక్టర్గా హిమాన్షు శుక్లా, ప.గో. జిల్లా కలెక్టర్గా పి.ప్రశాంతి, ఏలూరు జిల్లా కలెక్టర్గా ప్రసన్న వెంకటేశ్,
కృష్ణా జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఎస్.దిల్లీరావు, గుంటూరు జిల్లా కలెక్టర్గా వేణుగోపాల్రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్గా శివ శంకర్, బాపట్ల జిల్లా కలెక్టర్గా విజయ, ప్రకాశం జిల్లా కలెక్టర్గా దినేశ్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్గా కేవీఎన్ చక్రధర్ బాబు, తిరుపతి జిల్లా కలెక్టర్గా కె.వెంకటరమణా రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఎం.హరినారాయణ, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పీఎస్ గిరీష, కడప జిల్లా కలెక్టర్గా వి.విజయరామారావు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా పి.బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మి, నంద్యాల జిల్లా కలెక్టర్గా మన్జిర్ జిలానీ సామూన్, కర్నూలు జిల్లా కలెక్టర్గా పి.కోటేశ్వరరావు నియమితులయ్యారు.
COMMENTS