TOOTH BRUSH CHANGE REASONS
టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులు ఇవేనట!
- ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి? - ఎంతసేపు పళ్లు తోముకోవాలి?
Tooth Brush Change Reasons : నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తిన్న ఆహారం నోటి నుంచి కడుపులోకి చేరుతుంది. దీనికి మనం ముందుగా చేయాల్సిన పని బ్రష్‌ను ఎప్పటికప్పుడు మార్చడం. అలాగే బ్రష్‌ను శుభ్రంగా ఉంచుకోవడం. నాణ్యమైన బ్రష్‌లను ఉపయోగించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే బ్రష్‌ను రోజుకు రెండు సార్లు చేయమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో టూత్ బ్రష్‌ని ఎన్ని రోజులకీ మార్చాలి, దాని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం!
నోటి ఆరోగ్యం అనేది మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా ఆహారం నమలగలం, సృష్టంగా మాట్లాడగలం, ఆత్మవిశ్వాసంతో నవ్వగలం. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తవచ్చనని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టూత్ బ్రష్‌ని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల అందమైన చిరునవ్వుని దూరం చేయడమే కాదు, నోటి అపరిశుభ్రత అనేది గుండె జబ్బులకీ దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి :
టూత్ బ్రష్ విషయంలో 'త్రీ మంత్' రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతి మూడు నెలలకు బ్రష్ ఎంత బాగున్నా సరే, మార్చేయాల్సిందేనని అంటున్నారు. ఆ తరవాత వాడినా అది పనిచేయదని, ఈ లోగా వాటి బ్రెసిల్స్ రూపు కోల్పోతాయని తెలిపారు. దీంతో మీరు ఎంతసేపు బ్రష్ చేసినా దంతాలు శుభ్రమవ్వపోగా, దంతా సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా అరిగిపోయిన టూత్ బ్రష్ శుభ్రపరచడంలో తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి టూత్ బ్రష్ ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు లేదా బ్రష్ ముళ్ళగరికెలు చిరిగిపోతే ముందుగానే మార్చాలని The journal of the American Dental Association సిఫార్సు చేస్తుంది.
టూత్ బ్రష్‌లపై సూక్ష్మజీవులు :
బ్రష్ బాగున్నా కూడా కొన్నిరోజులకు ఇది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. పైగా చాలా వరకూ వీటిని సింకుల దగ్గర, బాత్రూమ్ల్లోనే ఉంచుతుంటారని, ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్‌లపై సూక్ష్మజీవులు చేరుతాయని హెచ్చరిస్తున్నారు. ఇవి గుండెజబ్బులు, ఆర్థరైటిస్, స్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వ్యాప్తికి కారణమవుతాయని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. కాబట్టి, ఎప్పటికప్పుడు మార్చక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే వాడుతున్నారేమో! :
బ్రష్ చేస్తూ ఆలోచించడం, ఈ క్రమంలో దాన్ని నమలడం లేదా గట్టిగా రుద్దడం వంటి అలవాట్లు ఉంటాయి, దీంతో కొత్తది తీసిన కొద్దిరోజులకే రూపు కోల్పోయి కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా సమయం ఉందిలెమ్మని అలాగే వాడుతున్నారేమో! ఇలా వాడడం వల్ల సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇవీ దంతాలను సరిగా శుభ్రం చేయవు, కాబట్టి ఎప్పటికప్పుడూ మార్చడం మంచిదని తెలిపారు.
ఇన్ఫెక్షన్ దరిచేరే ప్రమాదమూ :
జలుబు, జ్వరం, దగ్గు వంటివి వచ్చి తగ్గాకా బ్రష్‌ని మార్చాలట, ఎందుకంటే వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు ఈ క్రమంలో బ్రష్ మీదకి చేరతాయంటున్నారు నిపుణులు. ఒంట్లో నశించినా ఇవి దానిమీద మాత్రం కొన్ని రోజులపాటు బతకగలవని, దీంతో తిరిగి ఇన్ఫెక్షన్ దరిచేరే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఏదో వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తర్వాత మార్చమంటున్నారు.
ఎలా పళ్లు తోముకోవాలి :
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని mayoclinic పేర్కొంది . అంతే కాకుండా బ్రష్‌ని 45 డిగ్రీల కోణంలో పట్టుకొని, దంతాల ఉపరితలాలపై, చిగుళ్ల దగ్గర సున్నితంగా వృత్తాకార కదలికలతో బ్రష్ చేయడం, బలంగా రుద్దడం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ప్రతి 3-4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS