Ramdas got a job at ISRO by selling Panipuri
Success Story: పానీపూరీ అమ్ముతూ ఇస్రోలో జాబ్ కొట్టిన రాందాస్.. సక్సెస్ స్టోరీ ఏంటంటే..!
మీకు ఏదైనా సాధించాలనే కోరిక, తపన ఉంటే కష్టాలు మిమ్మల్ని ఆపలేవని అంటారు. అందుకు మీరు నిరంతరం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది..అలాంటిదే ఒక యువకుడి సక్సెస్ స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం. రోడ్డుపై గోల్‌గప్ప అమ్ముకునే వ్యక్తి ఏకంగా అంతరిక్షంలోకి ఎగురుతున్నాడు. అవును మీరు చదివింది నిజమే..పానీ పూరీ అమ్ముతూ జీవనం సాగించే ఒక యువకుడు ఇస్రోలో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం అతను ఇస్రోలో టెక్నీషియన్ విభాగంలో పనిచేస్తున్నాడని తెలిసింది. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి బండిలో వాటర్‌బాల్స్, పానీపూరీ అమ్ముతూ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు..? రాందాస్ సక్సెస్ స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని నందన్ నగర్‌కు చెందిన గోల్గప్పా విక్రేత రాందాస్ ప్రస్తుతం ఇస్రోలో టెక్నీషియన్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి డోంగర్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. అతని తల్లి గృహిణి. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతను బి.ఎ. తర్వాత చదువుకోలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాందాస్ పగటిపూట పానీపూరీ అమ్ముతూ.. రాత్రిపూట చదువుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
2023 సంవత్సరంలో ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల కోసం నియామక ప్రకటన జారీ చేసింది. ఆ సమయంలో రాందాస్ ఒక ఖాళీకి దరఖాస్తు చేసుకున్నాడు. అతను నాగ్‌పూర్‌లో ఆ పోస్టు కోసం పరీక్ష రాశాడు. ఆగస్టు 2024లో అతను శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన మే 19, 2025న జాయినింగ్ లెటర్‌తో శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో చేరారు. ఓ పేద కుటుంబంలో జన్మించిన రాందాస్ పట్టుదల, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగం సాధించారు. ఆయన కథ ఎందరికో స్ఫూర్తిదాయకం అంటున్నారు నెటిజన్లు.
COMMENTS