ICE APPLE BENEFITS
దేవుడిచ్చిన అమృతం తాటి ముంజలు - ప్రయోజనాలు తెలిస్తే లొట్టలేసుకొని తినాల్సిందే!
వేసవిలో లభించే ఒక ప్రత్యేకమైన పండు తాటిముంజ - చిలోనే కాదు, మేలు చేయటంలోనూ మేటి - అవేంటో చూద్దామా?
Health Benefits of Ice Apple in Telugu : వేసవి కాలంలో లేత కొబ్బరిలా తియ్యగా ఉండే తాటి ముంజలు రుచిలోనే కాదు, మేలు చేయటంలోనూ మేటి అనిపించుకుంటాయి. మానవుడికి ఆరోగ్యపరంగా ఎంతో విలువైనది తాటి ముంజులు. పల్లెల్లో ఉచితంగా దొరికే వీటికోసం పట్టణాల్లో జనాలు మాత్రం ఎగబడి కొంటూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం తెలిసినవాళ్లు తప్పనిసరిగా వేసవి సీజన్లో తింటారు.
మరి తాటి ముంజుల్లో ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూద్దామా?
వేసవి కాలంలో తాటి ముంజలు తింటే ఎండల వల్ల కలిగే తాపం తగ్గుతుంది.
తాటి ముంజలు మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన ఎ, బీ, సీ విటమిన్లు, పొటాషియం, భాస్వరం, ఐరన్, జింక్‌లు అందుతాయి.
చాలామంది తాటి ముంజల పొట్టు తీసి తింటారు. నిజానికి అందులోనూ ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.
చర్మం పొడిబారదు, ముఖానికి మెరుపు వస్తుంది. దద్దుర్లు, మచ్చలు, మొటిమలు ఉంటే తగ్గుతాయి.
గర్భిణులకు తాటి ముంజలు మరింత మేలు చేస్తాయి.
జీర్ణప్రక్రియ చాలా బాగుంటుంది. మలబద్ధక సమస్య ఉత్పన్నం కాదు. సమయానికి ఆకలి వేస్తుంది.
బరువు పెరిగిపోతున్నామని భయపడే వారు ఈ కాలంలో తాటి ముంజలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. వీటిలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ కనుక ఊబకాయాన్ని నివారిస్తాయి.
తాటి ముంజలు ఎసిడిటీని తరిమికొడతాయి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
తాటి ముంజలు తినటం వల్ల మన శరీరంలో చేరిన వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ఇవి క్యాన్సర్లు, ట్యూమర్లను సైతం తగ్గిస్తాయని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. కనుక వేసవి కాలంలో తరచూ తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
కాలిన గాయాలు, చర్మం మీద పొక్కుల్లాంటివి ఉంటే తాటి ముంజలను మెత్తగా గుజ్జులా చేసి లేపనంలా రాస్తే ఉపశమనం కలుగుతుంది. చికెన్ పాక్స్ వల్ల కలిగే దురదను సైతం తగ్గిస్తాయి.
COMMENTS