9,970 Assistant Loco Pilot Posts in Railways
RRB: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 12 నుంచి మే 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.
ప్రకటన వివరాలు:
* అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ): 9,970 పోస్టులు
ఆర్‌ఆర్‌బీ జోనల్ వారీ ఖాళీలు:
1. సెంట్రల్ రైల్వే- 376
2. ఈస్ట్ సెంట్రల్ రైల్వే- 700
3. ఈస్ట్ కోస్ట్ రైల్వే- 1,461
4. ఈస్ట్ రైల్వే- 868
5. నార్త్ ఈస్ట్రన్ రైల్వే- 100
6. నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే- 125
7. నార్తన్ రైల్వే- 521
8. సౌత్ వెస్ట్రన్ రైల్వే- 679
9. సౌత్ సెంట్రల్ రైల్వే- 989
10. సౌత్ ఈస్ట్‌సెంట్రల్ రైల్వే- 568
11. సౌత్ ఈస్ట్రన్ రైల్వే- 921
12. సధరన్ రైల్వే- 510
13. వెస్ట్ సెంట్రల్ రైల్వే- 759
14. వెస్ట్రన్ రైల్వే- 885
15. మెట్రో రైల్వే కోల్‌కతా- 225
మొత్తం ఖాళీల సంఖ్య: 9,970
ప్రారంభ వేతనం: నెలకు రూ.19,900.
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చేసినవారూ అర్హులే.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం వివరాలు: సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది. 75 ప్రశ్నలు, 75 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు; పార్ట్-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పార్ట్-ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్; పార్ట్-బిలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-04-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-05-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS