Zakir Hussain..These are the records achieved by tabla scholar who received Rs.5 reward?
Zakir Hussain : జాకీర్ హుస్సేన్ కన్నుమూత ..రూ.5 పారితోషికం అందుకున్న తబలా విద్వాంసుడు సాధించిన రికార్డులు ఇవా?
Zakir Hussain : జాకీర్ హుస్సేన్ .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మనం చిన్నప్పుడు ఆయన గురించి చాలానే విన్నాం. జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా అనే పాటలు కూడా వినిపించాయి.అయితే ఈ తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ (73) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అమెరికాలో ఉంటోన్న ఆదివారం (డిసెంబర్ 15) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో శాన్ ఫ్రాన్కిస్కోలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాత్రి జాకీర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. జాకీర్ హుస్సేన్ 1951లో జన్మించారు. తండ్రి పేరు జాకీర్ ఉస్తాద్ అల్లా రఖా. చిన్నవయస్సులోనే తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు..
Zakir Hussain ఘన నివాళి..
కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. విదేశాల్లో కూడా కచరీలు నిర్వహించాడు. గ్రామీ అవార్డు నుంచి పద్మవిభూషణ్ వరకు అతని జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు. ఉస్తాద్ అల్లా రఖా కుమారుడే ఈ జాకిర్ హుస్సేన్. కిర్ హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో పల్మొనరీ ఫైబ్రోసిస్ తో బాధపడుతూ కన్నుమూసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న ఘనత అతని సొంతం. విదేశాల్లో తన మొదటి కచేరీకి జాకీర్ హుస్సేన్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం 5 రూపాయలు మాత్రమే. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ జాకీర్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగిపోయాడు.
ఒక్కో షోకి 5 నుంచి 10 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. కాగా జాకీర్ హుస్సేన్ డబ్బు కంటే కళకు ఎక్కువ విలువ ఇచ్చారు. అందుకే ఆయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని తెలుస్తోంది. జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులు 8 నుంచి 10 కోట్ల రూపాయల దాకా మాత్రమే ఉంటుందని సమాచారం.జాకీర్ హుస్సేన్ గత కొంతకాలంగా బయట కనిపించడం లేదు. దీనికి కారణం అనారోగ్యమేనని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన హఠన్మారణంతో సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.
COMMENTS