Do you have a habit of using perfume? - There is a risk of unexpected loss after marriage!
మీకు పెర్‌ఫ్యూమ్ వాడే అలవాటు ఉందా? - పెళ్లి తర్వాత ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉందట!
Perfumes Impact On Your Fertility : నేటి యువతలో చాలా మంది పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇంట్లోంచి బయటకు వెళుతున్నామంటే చాలు.. పెర్‌ఫ్యూమ్ కొట్టాల్సిందే. ఇలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. నిత్యం సెంటు కొట్టుకునే వారికి.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఓ పరిశోధన తేల్చింది. ఏకంగా సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పరిమళాలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్.. మంచి రిఫ్రెష్‌నెస్‌ను అందిస్తాయి. అలాగే శరీరం నుంచి వచ్చే దుర్వాసనను కవర్ చేస్తాయి. అయితే.. కెమికల్స్ ఉన్న పెర్ఫ్యూమ్స్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ, పెర్ఫ్యూమ్స్ వాడకం ఏకంగా.. సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఎపిడెమియాలజిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ Shanna Swan. మరీ ముఖ్యంగా.. మగవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం(Obesity) వంటివి మగవారిలో సంతానలేమికి దారితీస్తుందని చాలా మందికి తెలిసిన విషయమే. అలాగే.. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పనిచేసే వారిలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పలు రీసెర్చ్‌లలో తేలింది. కానీ.. డాక్టర్ షన్నా స్వాన్‌తో పాటు ఇతర పరిశోధకులు జరిపిన ఒక రీసెర్చ్‌లో 'పెర్ఫ్యూమ్స్ వంటి సువానలు వెదజల్లే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడడం' కూడా పురుషులలో సంతానలేమికి(Infertility) దారితీసే అవకాశం ఉందని వెల్లడైంది. పెర్ఫ్యూమ్స్లో ఉండే కెమికల్స్ మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం చూపి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతాయని డాక్టర్ షన్నా చెబుతున్నారు.
అంతేకాదు.. కొన్ని రకాల సబ్బులు, లోషన్లు, పెర్‌ఫ్యూమ్ బాటిల్స్ తయారీకి పారాబెన్స్ వంటి సింథిటిక్ రసాయనాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇవి కూడా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. అది కాలక్రమేణా మగవారిలో వంధ్యత్వానికి దారి తీయొచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. పురుషులు పెర్ఫ్యూమ్స్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వీలైతే కెమికల్స్ ఉండే పెర్ఫ్యూమ్స్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS