Ration Card : Aadhaar-ration card linking deadline extension.. If not done by the last date, it will not work anymore..!
Ration Card : ఆధార్-రేషన్ కార్డ్ లింకింగ్ గడువు పొడిగింపు.. చివరి తేదీలోగా చేసుకోకపోతే ఇక పనిచేయనట్టే..!
Ration Card : ఆధార్ కార్డును రేషన్ కార్డ్‌తో లింక్ చేయని వారికి ఒక శుభవార్త తెలిపింది. రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి 30 సెప్టెంబర్ 2024 చివరి తేదీగా పేర్కొంది. అంతకుముందు గడువు జూన్ 30 గా నిర్ణయించబడింది. కానీ తాజాగా గడువును పెంచుతూ ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Ration Card వన్ నేషన్- వన్ రేషన్:
రేషన్ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం “వన్ నేషన్-వన్ రేషన్” పథకాన్ని ప్రకటించింది. ప్రజలు ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను కలిగి ఉండకుండా నిరోధించడానికి రేషన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని పేర్కొంది.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా అతి తక్కువ ధరకు ఆహార ధాన్యాలు మరియు కిరోసిన్ అందజేస్తారు. ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నవారు ఎక్కువ రేషన్ తీసుకుంటున్నారని, అవసరమైన వారికి ప్రభుత్వ సాయం అందకుండా పోతుందని చాలా సందర్భాల్లో తేలింది. కావునా రేషన్‌కార్డులతో ఆధార్‌కార్డులను అనుసంధానించే ఈ చర్యతో అవినీతి, మోసాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుతో ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలి :
– పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పోర్టల్‌ని సందర్శించాలి
– యాక్టివ్ కార్డ్‌తో ఆధార్ లింక్‌ని ఎంచుకోవాలి.
– మీ రేషన్ కార్డ్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
– కొనసాగించు/సమర్పించు బటన్‌ను ఎంచుకోవాలి.
– మీ మొబైల్ ఫోన్కు OTP వస్తుంది.
– ఆధార్ రేషన్ లింక్ పేజీలో OTPని నమోదు చేయాలి.
– ప్రక్రియ పూర్తయిన తర్వాత, అదే విషయాన్ని తెలియజేసే SMSను అందుకుంటారు.
COMMENTS