Nalleru : If you know the medicinal properties of Nalleru... you will find it anywhere and bring it home...!
Nalleru : నల్లేరు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకుంటారు…!
Nalleru : నల్లేరు అనే మొక్క తీగ జాతికి చెందినది. ఈ మొక్క ఎక్కడైనా చాలా ఈజీగా పెరుగుతుంది. అయితే తీగ జాతికి చెందినటువంటి ఈ నల్లేరు మొక్కలను వజ్రవల్లి మరియు అస్థి సంహారక అని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నల్లేరు తీగ వలన కలిగే ప్రయోజనాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నల్లేరులో కాల్షియం, విటమిన్ సి, సెలీనియం, క్రోమియం, విటమిన్ బి మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఈ నల్లేరు ఎముకల దృఢత్వాన్ని బలంగా తయారు చేయటమే కాకుండా పక్కనే ఉన్నటువంటి కండరాలకు కూడా శక్తిని ఇస్తుంది. ఈ మొక్కతో విరిగిన ఎముకలు కూడా తొందరగా అతుక్కుంటాయి…
మహిళల్లో మోనోపాజ్ లక్షణలలో అతి ముఖ్యమైనది ఎముకల బలహీనత. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఈ నల్లేరులో పీచ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఫైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ నల్లేరు రసంలో తేనె మరియు కొద్దిగా పంచదార వేసుకొని తాగినట్లయితే పీరియడ్స్ కు సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాక ప్లాస్టిక్ నిరోధించే గుణాలు దీనిలో సమృద్ధిగా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. ఈ నల్లేరులో నొప్పి నివారణ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే ఆస్ప్రిన్ మందుకు సమానంగా ఉండే ఔషధ గుణాలు నొప్పి తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు నిపుణులు.
ఈ నల్లేరు లో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ నల్లేరు రసంతో రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది. ఈ నల్లేరు తీగ రసం రక్తహీనత సమస్యలను కూడా తగ్గిస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ నల్లేరు లో ఉండే పీచు ఫైల్స్ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ నల్లేరు మొక్కను కోసినా లేక కొరికినా దురద అనేది వస్తుంది. అందుకే దీనిని కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద అనేది రాదు…
COMMENTS