New features in YouTube shorts that beat Tik Tok; Try it..
YouTube Shorts: టిక్ టాక్ ను తలదన్నేలా యూట్యూబ్ షార్ట్స్ లో అదిరిపోయే కొత్త ఫీచర్స్; ట్రై చేయండి..
YouTube Shorts: టెక్స్ట్-టు-స్పీచ్ (text to speech) వీడియో నెరేషన్ ఆప్షన్ తో సహా కొత్త ఫీచర్లను యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి తెచ్చింది. టిక్ టాక్ వీడియోలలో తరచుగా వినిపించే రోబోటిక్ వాయిస్ ల మాదిరిగానే కృత్రిమ వాయిస్ ఓవర్ లను జోడించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి, ముందుగా టెక్స్ట్ ను క్రియేట్ చేయాలి. ఆ తరువాత, స్క్రీన్ ఎగువ-ఎడమ కార్నర్ లో ఉన్న " యాడ్ వాయిస్" చిహ్నాన్ని ట్యాప్ చేసి, అందుబాటులో ఉన్న నాలుగు వాయిస్ లలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్:
అదనంగా, యూట్యూబ్ క్యాప్ కట్ వంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించకుండా వీడియోలకు జోడించగల ఆటో జనరేటెడ్ క్యాప్షన్ లను కూడా యూట్యూబ్ షార్ట్స్ పరిచయం చేస్తోంది. షార్ట్స్ లో ప్రస్తుతం ఉన్న మాన్యువల్ టెక్స్ట్ ఓవర్ లే (text overlay) ఫీచర్ మాదిరిగానే వినియోగదారులు ఈ శీర్షికలను వివిధ ఫాంట్లు, రంగులతో కస్టమైజ్ చేసుకోవచ్చు.
మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్, మినీగేమ్:
యూట్యూబ్ (YOUTUBE) కొత్తగా షార్ట్స్ లో మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్ ఫీచర్ ను యాడ్ చేసింది. ఇందులో గ్రీన్ స్క్రీన్ గేమ్-థీమ్ నేపథ్యం ఉంటుంది. అలాగే, మైన్ క్రాఫ్ట్ రష్ అనే మినీగేమ్ కూడా ఉంటుంది. వీడియో ప్లాట్ ఫామ్ లు ఒకదానికొకటి ఫీచర్లను స్వీకరించే ధోరణిని ఈ అప్ డేట్స్ ప్రతిబింబిస్తాయి. షార్ట్స్ ఫీడ్ లో లైవ్ వీడియో ప్రివ్యూ వంటి పాపులర్ టిక్ టాక్ ఫీచర్లను యూట్యూబ్ పొందుపరిచింది. మరోవైపు, టిక్ టాక్ తన వీడియో నిడివిని పొడిగించింది.
వర్టికల్ వీడియో ఫార్మాట్:
యూట్యూబ్ షార్ట్స్ ప్లాట్ ఫామ్ కు మరింత మంది క్రియేటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఫీచర్స్ ను యూట్యూబ్ తీసుకువస్తోంది. ప్రస్తుతం వర్టికల్ వీడియో ఫార్మాట్ పై టిక్ టాక్ ఆధిపత్యం ఉంది. దానికి పోటీగా యూట్యూబ్ సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ లోని ఈ కొత్త ఫీచర్లు క్రియేటర్లకు వారి కంటెంట్ ను మెరుగుపరచడానికి మరిన్ని సాధనాలను అందిస్తాయి. యూట్యూబ్ తీసుకువస్తున్న ఈ కొత్త అప్ డేట్స్ వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించడానికి వీలు కల్పిస్తాయి.
COMMENTS