CNG vs petrol vs electric bike.. which one is the best? Let's find out..
సీఎన్‌జీ vs పెట్రోల్ vs ఎలక్ట్రిక్ బైక్.. వీటిలో ఏది బెస్ట్?
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ(CNG) మన దేశంలో అధికారికంగా లాంచ్ అయ్యింది. బజాజ్ ఇండియా ఈ ఇన్నోవేటివ్ బైక్‌ను ఆవిష్కరించి.. ప్రపంచంలోనే సీఎన్జీ బైక్ ను తీసుకొచ్చిన మొట్టమొదటి ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరు గడించింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని అట్టహాసంగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆటోమోటివ్ ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు ఈ బైక్ వైపు మళ్లింది. అయితే అసలు దీనిలో కొత్తగా వచ్చిందేంటి? పెట్రోల్ బైక్ తో పోల్చితే దీనిలో ఏం ప్రత్యేకత ఏమిటి? ఎలక్ట్రిక్ బైక్ కి దీనికి వ్యత్యాసం ఏమిటి? ప్రయోజనాలు ఏమిటి? పనితీరులో తేడాలేంటి? తెలియాలంటే ఈ కథనం చివరి వరకూ చదవాల్సిందే..
ధరల పోలిక..
సీఎన్జీ బైక్ ప్రారంభ ధర పెట్రోల్ బైక్ మోడల్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌ల కంటే తక్కువ ధరలో ఉంటుంది. సీఎన్జీకి పెట్రోల్ కంటే తక్కువ రన్నింగ్ కాస్ట్ అవసరం అవుతుంది. నేటికి ఒక కిలో సీఎన్‌జీ ధర రూ. 85.50 గా ఉంది. కాగా, లీటర్ పెట్రోల్ ధర రూ. 110 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి మనం రోజూ గణనీయమైన మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు. అలాగే మైలేజీల సీఎన్జీ ఎక్కువే ఇస్తుంది. బజాబ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ ఒక కిలో గ్యాస్ కు 102 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో, దీని నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే కొంచెం ఎక్కువ. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు దీని కన్నా అధిక ధరను కలిగి ఉంటాయి.
పర్యావరణ ప్రభావం..
పెట్రోల్ మోడల్‌లతో పోలిస్తే సీఎన్జీ బైక్‌లు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కాబట్టి, సీఎన్జీ వాహనాలను గ్రీన్ మొబిలిటీ వాహనంగా పరిగణిస్తారు. అయితే, ఇవి ఎలక్ట్రిక్ బైక్‌ల వలె పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి అని చెప్పలేం. మరోవైపు పెట్రోలు బైకులు అధిక ఉద్గారాలను కలిగి ఉంటాయి. వాయు కాలుష్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
పనితీరు..
పెట్రోల్ ద్విచక్ర వాహనాల కంటే సీఎన్జీ బైక్‌లు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న సీఎన్ జీ కార్లే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో, ఎలక్ట్రిక్ బైక్‌లు సిజ్లింగ్ టార్క్‌ను కలిగి ఉంటాయి. పెట్రోల్ వాహనాలు అధిక దూరం, అధిక వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఖర్చు కూడా అధికంగానే అవుతుంది.
ఇంధనం లభ్యత..
పెట్రోల్ బంకులతో పోలిస్తే సీఎన్జీ స్టేషన్ల లభ్యత చాలా తక్కువ. ఎక్కడ చూసినా పెట్రోలు బంకులే కనిపిస్తాయి. ఇదే సమయంలో దేశంలో సీఎన్‌జీ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు చమురు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. సీఎన్జీ స్టేషన్‌ల మాదిరిగానే, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అవి చాలా తక్కువ సంఖ్యలో పనిచేస్తున్నాయి.
నిర్వహణ ఖర్చులు..
సీఎన్జీ బైక్‌ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో పెట్రోల్ వాహనాల కంటే కొంచెం తక్కువ కదిలే భాగాలు ఉంటాయి. కానీ పెట్రోల్ సీఎన్జీ కంటే ఎలక్ట్రిక్ బైక్‌ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ముఖ్యంగా పెట్రోల్ వాహనాలకు ప్రత్యేక సర్వీసులు అవసరం. అంతే కాదు, కాలక్రమేణా అధిక నిర్వహణ ఖర్చులను కూడా అందిస్తాయి.
సీఎన్జ్ బైక్ రైడ్ ఎలా ఉంది..
పెట్రోల్ బైక్‌లు ఎక్కువ శబ్దం, వైబ్రేషన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే సీఎన్జీ వాహనాలు అలా ఉండవు. ఇది చాలా నిశ్శబ్దంగా, తక్కువ వైబ్రేషన్‌ను అందిస్తుంది. మరోవైపు, ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. బైక్ స్టార్ట్ అయిందో లేదో కూడా తెలియదు.
హిట్ అవుతుందా..
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకు భారత మార్కెట్‌లో సానుకూల స్పందన లభించింది. ప్రస్తుతం ఈ బైక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బైక్ ధర, పనితీరు, మైలేజ్ ను బట్టి మార్కెట్లో ఈ బైక్ విజయవంతమవుతుందా లేదా అనేది చూడాలి. అయితే బజాజ్ సీఎన్జీ బైక్ మాత్రం ఎలక్ట్రిక్, పెట్రోల్ మోడళ్లకు మంచి ప్రత్యామ్నాయం. ఇది తక్కువ రన్నింగ్ ఖర్చులు, తక్కువ ఉద్గార సామర్థ్యం కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నారు.
COMMENTS