AP TET New Schedule : AP TET new schedule is here, important dates
AP TET New Schedule : ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్య తేదీలివే.
AP TET New Schedule : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్) షెడ్యూల్ మారింది. గత షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ, టెట్ పరీక్షలకు 90 రోజుల ప్రిపరేషన్ సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఏపీ టెట్ ముఖ్య తేదీలు:
- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల - జులై 2
- పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ -ఆగస్టు 3
- ఆన్‌లైన్ అప్లికేషన్లు చివరి తేదీ - ఆగస్టు3
- ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు - సెప్టెంబర్ 19 నుంచి
- టెట్ హాల్ టికెట్లు - జులై 22 నుంచి డౌన్ లోడ్
- టెట్ షెడ్యూల్ - అక్టోబర్ 3 నుంచి 20 వరకు
- ప్రాథమిక కీ విడుదల - అక్టోబర్ 4
- ప్రాథమిక కీపై అభ్యంతరాలు - అక్టోబర్ 5
- ఫైనల్ కీ విడుదల - అక్టోబర్ 27
- టెట్ ఫలితాలు విడుదల - నవంబర్ 2
ఏపీ టెట్-2024 అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. జులై 3వ తేదీ నుంచి ఫీజు చెల్లింపులు ప్రారంభం కాగా జులై 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లో ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఏపీ టెట్ దరఖాస్తులకు ఆగస్టు 3వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి. పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ టెట్ కు దరఖాస్తు ఎలా?
Step 1 : టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హోం పేజీలో కనిపించే Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : పేమెంట్ పూర్తి చేసిన సమయంలో జనరేట్ అయిన Candidate IDతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
Step 4 : లాగిన్ పై నొక్కితే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
Step 5 : మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 6 : చివరిగా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఫీజు చెల్లింపు ఇలా:
Step 1 : టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హోం పేజీలో కనిపించే Payment అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : ఇక్కడ Candidate Name, పుట్టిన తేదీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
Step 4 : వీటితో పాటు అభ్యర్థి రాసే పేపర్ ను ఎంచుకోవాలి.
Step 5 : ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
Step 6 : నిర్ణయించిన ఫీజును చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి.
Step 7 : ఫీజు చెల్లింపు ప్రక్రియ తర్వాత పేమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను చేసుకోవచ్చు.
Post a Comment