Nail Moon: Do you have half moon shape on your nails. Let's find out what it means.
Nail Moon:మీ గోర్లపై అర్థ చంద్రాకారం ఉందా.దీని అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు గోళ్లను చూసి మనకు ఏ ఆరోగ్య సమస్య ఉందో చెప్పటం చూస్తూ ఉంటాం. ఏ ఇద్దరి వ్యక్తుల యొక్క చేతి గోర్లు ఒకేలా ఉండవు.
వేలి గోర్లపై అర్ధచంద్రాకారం లో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను 'లునులా' అని అంటారు. 'లునులా' అంటే లాటిన్ భాషలో 'స్మాల్ మూన్' అని అర్ధం.
అయితే గోరు మీద ఉండే ఈ లునులా ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుందట. గోరు రంగు.. లునులా తీరు ను బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చట.
చేతి గోర్లపై లునులా లేకపోతే.. వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్ధం.
లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించ వచ్చట.
లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లు గా ఉంటే.. వారు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారని.. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు ఉన్నాయని తెలుసుకోవచ్చట.
లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని అర్ధం చేసుకోవాలి…
మన ఆరోగ్యం గురించి తెలిపే గోరు.. లునులా ని నిర్లక్షం చేయకుండా ఒక్క సారి.. మీ చేతి గోర్ల ను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడు గోళ్ళ రంగును బట్టి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం.
- గోళ్లు పాలిపోయి ఉంటే ఐరన్ శాతం తక్కువైందని అర్థం. దీని కారణంగా రక్తహీనత, గుండెజబ్బులు మరియు లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. అందువల్ల ఐరన్ సమృద్ధిగా లభించే పచ్చని ఆకుకూరలు, పాలకూర, బెల్లం, ఫ్రూట్ జ్యూస్ లు బాగా సేవించాలి.
- గోళ్లు పసుపు రంగులో ఉంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కారణం. అని అర్ధం. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య మరియు మధుమేహంతో బాధపడేవారిలో ఇలా ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య మరియు మధుమేహంతో బాధపడేవారిలో ఇలా ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
- గోర్లు నీలం రంగులో కనిపిస్తే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగా అందటం లేదని అర్ధం. అంతేకాక ఇన్సూలిన్ లోపంగా గుర్తించాలి. గుండె జబ్బులు మరియు ఊపిరి తిత్తుల సమస్య కారణంగా గోర్లు నీలం రంగులోకి మారుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- గోర్లపై తెల్లని చారలు ఉంటే కాలేయ సంబంధిత సమస్యలు లేదా కిడ్నీ సమస్యల ప్రభావం అని అర్ధం. శరీరానికి ప్రోటీన్ సరిపడా స్థాయిలో అందకపోవడమే కారణం. అందుకని ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవాలి.
- >>>>FOR MORE HEALTH TIPS CLICKHERE
COMMENTS