How To Check Name In Voter List By Sms And Helpline
Elections 2024 : ఓటరు లిస్టులో మీ పేరు ఉందా..? లేదా..? ఎస్ఎంఎస్, హెల్ప్‌లైన్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి!
Elections 2024 : దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. ఇక ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఓటు వేసేందుకు తాము అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత EPIC నంబర్. ఓటర్లందరికీ భారత ఎన్నికల సంఘం ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుందనే విషయం తెలిసిందే. దీని ద్వారా మనం చాలా సింపుల్‌గా ఓటరు లిస్టులో మన పేరు ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఎంఎస్ ద్వారా.. రెండోది ఈసీ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
SMS ద్వారా ఇలా చెక్ చేసుకోవాలి :
- మొదట మీ ఫోన్ నుంచి టెక్ట్స్ సందేశాన్ని పంపాలి.
- ముందుగా EPIC ఓటర్ ఐడీ నంబర్ నోట్ చేసుకుని పెట్టుకోవాలి
- ఈ EPIC voter ID numberను సందేశం రూపంలో 1950 నెంబర్‌కి పంపాలి
- అనంతరం మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు ఉంటాయి.
- ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి మెసేజ్ రాదు.
హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఇలా చెక్ చేసుకోవాలి :
ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. దీని కంటే ముందు మీ EPIC ఓటర్ ఐడీ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. అనంతరం మీ ఫోన్ నుంచి 1950కి డయల్ చేయాలి. ఆ తర్వాత IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ప్రకారం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడే మన EPIC ఓటర్ ఐడీ నంబర్ ఇవ్వాలి. అలా EPIC ఓటర్ ఐడీ నంబర్ ఇచ్చిన తర్వాత మీ ఐడీ స్టేటస్ తెలుస్తుంది.
COMMENTS