Kidney and Eyes: Can kidney health be seen in the eyes?
Kidney and Eyes: మూత్రపిండాల ఆరోగ్యం కళ్లలో కూడా తెలుస్తుందా..?
Kidney and Eyes: ప్రస్తుత కాలంలో కిడ్నీ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యతో దీని ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సైలెంట్ ఎపిడెమిక్‌గా రూపుదిద్దుకుంటోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యల లక్షణాలను సకాలంలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అయితే ఇటీవలి అధ్యయనంలో కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కళ్లలో కూడా కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. రెటీనా, కోరోయిడ్, అంటే రెటీనా వెనుక ఉన్న రక్తనాళాల పొరలో మార్పుల ఆధారంగా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ విషయం ఫిట్‌నెస్ చిట్కాలు, కిడ్నీ ఆరోగ్యం కళ్ళ అధ్యయనం ద్వారా వెల్లడైంది. దీనిపై కోని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లలో కిడ్నీ సమస్యలు:
కిడ్నీ వ్యాధుల లక్షణాల గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు అధ్యయనం చేశారు. కళ్లను పరిశీలించడం ద్వారా కిడ్నీ సమస్యలను సులభంగా గుర్తించవచ్చని గుర్తించారు. కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే ఆ ప్రభావం రెటీనాపై కనిపిస్తుంది. అంతేకాదు.. తీవ్రమైన పరిస్థితుల్లో.. రెటీనా వెనుక గడ్డకడుతుంది. కళ్లలో కనిపించే ఇలాంటి మార్పుల ద్వారా కిడ్నీ వ్యాధిని గుర్తించవచ్చని తెలిపారు.
అధ్యయన నివేదిక:
కిడ్నీలకు, కళ్లకు మధ్య సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. రెటీనా, కోరోయిడ్, అంటే రెటీనా వెనుక ఉన్న రక్తనాళాల పొరలో మార్పుల ఆధారంగా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు. ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (OCT) అనే ఇమేజింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి.. ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే CKD ఉన్న రోగులలో రెటీనా, కొరోయిడ్ చాలా సన్నగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. OCT టెక్నాలజీ అన్ని కంటి క్లినిక్‌లలో అందుబాటులో ఉంది. దీని ద్వారా కళ్లతో పాటు కిడ్నీలకు సమస్య ఉందా లేదా అని నిర్ధారించవచ్చు.
కళ్ళు-మూత్రపిండాల మధ్య సంబంధం:
ఈ నివేదికలో.. కళ్ళు, మూత్రపిండాల మధ్య చాలా సంబంధాలు ఉన్నాయని పరిశోధకులంటున్నారు. ఇద్దరూ తమ పని కోసం చిన్న రక్తనాళాలపై ఎక్కువగా ఆధారపడతారు. కంటిలోని ఈ సున్నితమైన నాళాలు రెటీనాను పోషించడానికి పని చేస్తాయి. అదే సమయంలో.. ఇది మూత్రపిండాలలో వడపోత వ్యవస్థను ఏర్పరుస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరచడానికి పనిచేస్తుంది. CKD వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో.. రక్త నాళాలు దెబ్బతిన్నప్పుడు.. ఇది కంటి సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడం ద్వారా కళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చని ఈ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS