Dr BR Ambedkar Biography
బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్ర .
బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలువబడే భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల, కులాలు ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మూగ బోయిన అణగారిన ప్రజలకు ఆదర్శవంతుడు అయినాడు బి.ఆర్.అంబేద్కర్ .భారతీయ సమాజంలో దళితుల హక్కుల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప కార్యకర్త మరియు సంఘ సంస్కర్త.
ఏప్రిల్ 14 1891వ సంవత్సరంలో రాంజీ మాలోజి సక్పాల్ మరియు బీమాభాయ్ దంపతులకు అంబేద్కర్ గారు జన్మించారు. ఈయన మధ్యప్రదేశ్ లోని మావ్ గ్రామంలో మహర్ కులంలో జన్మించారు, అప్పట్లో ఈ కులం అంటరానికులంగా ఉండేది. ఆ దంపతులకు ఈయన 14వ సంతానం. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమారావు రాంజీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సేవకుడి గా పని చేసేవారు.
అంబేద్కర్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు అంబేద్కర్ తండ్రి తన వృత్తి నుండి రిటైర్ అయ్యారు మరియు కుటుంబం మొత్తం ముంబైకి మకాం (Migrate) మార్చారు. అక్కడ మరో చిన్న ఉద్యోగం చేశారు.
అంబేద్కర్‌కు ఆరేళ్ల వయసులో వచ్చినప్పటికీ ఆయన తల్లి చనిపోయింది. ఆ సమయంలో మొత్తం 14 మందిలో ముగ్గురు అబ్బాయిలు మరియు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలారు..
దళితుడైన అంబేద్కర్‌కు చిన్నప్పటి నుంచి అనేక వేధింపులకు గురయ్యాడు. చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వేరే ఊరికి వెళుతుండగా దాహం వేసి పక్కనే ఉన్న ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అతను మహర్ కులానికి చెందినవాడని తెలిసి, నీరు ఇవ్వడానికి నిరాకరించారు. బదులుగా అతనిని మందలించి అతని పక్కనే ఉన్న బురద గుంటలో నీరు త్రాగడానికి పంపారు.
ఇంతే కాకుండా పాఠశాలలో కూడా, ఇతర విద్యార్థులు లోపల కూర్చునేవారు కాని అంబేద్కర్ తరగతి గది వెలుపల, ప్రవేశ ద్వారం దగ్గర కూర్చునేవారు. ఒక ఉపాధ్యాయుడు ఒకసారి బోర్డు మీద ఎవరూ సాధించలేని ఒక లెక్కను వ్రాసాడు. అయితే మిగిలిన యువకులు అంబేద్కర్ చేయబోతున్నప్పుడు తమ భోజన క్యారేజీలు బోర్డుకు దగ్గరగా ఉన్నాయని భావించి అంబేద్కర్ బ్లాక్ బోర్డ్‌ను తాకడానికి నిరాకరించారు.
ఎక్కడికి వెళ్లినా కులం ఆధారంగా వివక్షను అంబేద్కర్ ఎదుర్కొనేవారు. అయితే చదువు విషయంలో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. కృష్ణాజీఅంబేద్కర్ ఉపాధ్యాయుడి కు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. అంబేద్కర్ ఇంటిపేరు గతంలో అంబావడేకర్. అయితే, శిక్షకుడు అంబేద్కర్ని ఇష్టపడి అతని పేరును అంబావడేకర్ నుండి అంబేద్కర్‌గా మార్చాడు. అప్పటి నుండి అతని పేరు BR అంబేద్కర్ గా మార్చబడింది.
1907లో ఎల్ఫిన్‌స్టోన్ హైస్కూల్‌లో అతను తన విద్యను ముగించాడు. ఆ రోజుల్లో, మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం దళితుడికి పెద్ద విజయం. అందులో భాగంగా అతని భవిష్యత్తు చదువుకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకొచ్చారు.కానీ, తన చదువును కొనసాగించకముందే, అంబేద్కర్ తన 15 సంవత్సరాల వయస్సులో 9 సంవత్సరాల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నాడు. బరోడా మహారాజ్ సాయాజీ రావ్ గైక్వాడ్ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేవారు అని తెలుసుకొని. అలా బరోడా సంస్థానం నుంచి వచ్చే స్కాలర్షిప్ తో 1912వ నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు.
తర్వాత అంబేద్కర్ గారు అదే బరోడా ఇన్స్టిట్యూషన్ లో ఉద్యోగం దక్కించుకున్నారు కానీ అంబేద్కర్ గారికి ఉన్నత చదువులు చదువుకోవాలని కోరిక ఉండేది. దీని గురించి ఆయన మహారాజ్ కి చెప్పితే ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కానీ ఒక షరతు పెట్టారు అది ఏమిటంటే విదేశాలలో చదువు పూర్తయ్యాక భారతదేశానికి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలోనే పది సంవత్సరాలు పని చేయవలసి ఉంటుందని మహారాజ్ గారు శరత్ పెట్టారు దీనికై అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు అలా బరోడా సంస్థానం నుంచి వచ్చే స్కాలర్షిప్ తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో (Columbia University) చేరారు
అప్పుడు అంబేద్కర్ గారు అమెరికాలో స్వేచ్ఛ అంటే ఏమిటో మొదటిసారిగా చూశారు. ఎందుకంటే అమెరికాలో కుల జాతి విపక్ష భారతదేశంలో ఉన్నట్టు అమెరికాలో ఉండేది కాదు. అప్పట్లో అమెరికాలో అందరికీ సమానమైన గౌరవం కూడా దక్కేది మరియు అవకాశాలు కూడా దక్కేవి. అక్కడ యూనివర్సిటీలో అంబేద్కర్ గారు పీజీ పీహెచ్డీ (Phd) పూర్తి చేశారు ఆ తర్వాత 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు .అక్కడి 8 సంవత్సరాలలో పూర్తి చేయవలసిన చదువును కేవలం రెండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి చేశారు అందుకోసం అంబేద్కర్ గారు సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలను క్రమం తప్పకుండా చదివేవారు.
అంబేద్కర్ గారు లండన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఎన్నో అంశాలు పై పుస్తకాలు కూడా రాసేవారు అక్కడ ఆయనకు డాక్టర్ కూడా లభించింది కానీ కొంత కాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం చేయమని ఉత్తరం వచ్చింది. దాంతో 1917లో అంబేద్కర్ గారు భారతదేశానికి తిరిగి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణశాఖలో ఉద్యోగంలో చేరారు.
అక్కడ ఆయనకి పెద్ద ఉద్యోగం దొరికిన చిన్న కులస్తు వారు కావడంతో ఆయన కింద పని చేసేవారు ఎవరు గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ అతనికి ఇవ్వాలంటే దూరంగా పెట్టేసి లేదా విసిరేసి ఇచ్చేవారు. చివరికి ఉండడానికి ఇల్లును కూడా ఎవరు ఇచ్చేవారు కాదు.
చివరికి తన పరిస్థితిని బరోడామహారాజ్ కి చెప్పుకున్న ఆయన ఏమీ చేయలేను అని చెప్పడంతో అంబేద్కర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి ముంబై వెళ్ళిపోయారు .ఎటువంటి ఉద్యోగం లేక ఆదాయం కోసం ఆదాయం కోసం ట్యూషన్స్ మరియు కంపెనీస్ కు సలహా ఇచ్చే ఒక కన్సల్టింగ్ బిజినెస్ ని మొదలుపెట్టారు అవి కొన్ని రోజులు మాత్రమే ప్రశాంతంగా సాగేవి ఎప్పుడైతే అంబేద్కర్ గారు చిన్న కులస్తుడు అని తెలియడంతో ఎవ్వరూ ఆ ట్యూషన్ కు మరియు ఆ కంపెనీకి రావడం మానేశారు దాంతో ఆ కంపెనీని అంబేద్కర్ గారు మూసి వేశారు.
చివరగా, గవర్నర్ మద్దతుతో, బాంబీ లో ఒక కళాశాలలో ప్రొఫెసర్ అయ్యాడు. ఆ దిశగా 1927లో అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలా మహద్లో దళితులు మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశం నలుమూలల నుండి కొన్ని వేలమంది దళితులు తరలివచ్చారు అప్పటివరకు దళితులు మహద్ లోని చెరువు నీటిని తాగడానికి అక్కడ ప్రజలు అనుమతించేవారు కాదు కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువు నీటిని తాగేలా అనుమతి వచ్చేలా చేశారు. అప్పటికి అంటే నీళ్లు తాగడానికి అనుమతి వచ్చేసరికి ఆ చెరువు నీరు తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి చెరువులో నీటిని తాగారు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు దేశమంతా మారు మోగి పోయింది.
దళితులకు పాఠశాలలు, దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంలో ఉద్యమాలు ప్రారంభించి విజయం సాధించారు. చదువు వల్లే ఇంత స్థాయికి చేరుకున్నారు. తద్వారా అందరికీ విద్య అందుబాటులో ఉండేలా కృషి చేశారు. కొన్ని రోజుల తర్వాత ముంబైలో బారిస్టర్‌గా పని చేయడం అంబేద్కర్ గారు ప్రారంభించారు.
అయితే, అంబేద్కర్ భార్య రమాబాయి 1935లో అనారోగ్యంతో మరణించారు. కొంత కాలానికి, అతను బొంబాయిలో ప్రిన్సిపాల్ మరియు న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది, కానీ అతను తిరస్కరించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ అనే రెండు రాజకీయ పార్టీలను కూడా స్థాపించారు.
అయితే, స్వాతంత్ర్యం తరువాత, అంబేద్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్‌లో మొదటి న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. ఇంకా, అంబేద్కర్ గారు కు భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం లభించింది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన ఎంపికయ్యారు. అలా మన భారతదేశ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల “11 నెలల 18 రోజులు(2Years 11 Months 18Days ) ” రాయడం జరిగింది.
అంబేద్కర్ గారు వారి బోధనలకు చలించి బౌద్ధమతమయ్యారు. అతను 'ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మా' అనే పుస్తకాన్ని కూడా రచించారు . అతను డిసెంబర్ 6, 1956న కన్నుమూశారు.
అంబేద్కర్ జయంతి అనేది ఆయన జన్మదినాన్ని ఆయన చేసిన గొప్ప పనులను మరియు ఆయన మన భారతదేశానికి అందించిన రాజ్యాంగాన్ని స్మరించుకునే రోజు.
COMMENTS