Telangana SSC Hall Tickets 2024.
తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. పరీక్షలు ఎప్పటినుంచంటే?
2024 SSC Hall Tickets : తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ టెన్త్ క్లాస్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను మార్చి 7న (గురువారం) విడుదల చేసింది. తెలంగాణ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి. టెన్త్ పరీక్షల సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.
ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీఎస్ఈ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ (bse.telangana.gov.in) ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్లను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు అన్ని స్కూళ్లకు పంపించారు. విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2676 పరీక్షా కేంద్రాలు.. 5.08 లక్షల మంది విద్యార్థులు :
ఈ ఏడాదిలో టెన్త్ పరీక్షలను 6 పేపర్లకు బదులు 7 పేపర్లతో పరీక్షలను నిర్వహించనున్నారు. అందులో సైన్స్ సబ్జెక్టులను ఫిజికల్ సైన్స్ పార్ట్–1, బయాలజికల్ సైన్స్ పార్ట్-2 అనే రెండు పరీక్షలుగా నిర్వహించనున్నారు. ఈ రెండు పేపర్ల పరీక్షల సమయం ఉదయం 9:30 నుంచి ఉదయం 11.00 గంటల వరకు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2676 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
TS SSC Hall Tickets 2024 Download
2024 ఏడాదిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. అన్ని సబ్జెక్టులలో అభ్యంతర పత్రం (పార్ట్- బి) చివరి అరగంటలో మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు బీఎస్ఈ (BSE) తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.
టీఎస్ ఎస్ఎస్‌సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు అభ్యర్థులు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.
- ముందుగా (bse.telangana.gov.in) తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో ‘TS SSC Hall Ticket 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆపై Submit బటన్ క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఒక హార్డ్ కాపీని ఉంచుకోండి.
COMMENTS