Crow: What is the sign of a crow crowing repeatedly in front of a house?
Crow: ఇంటి కాకి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం.?
కాకులతో మనుషులకు ఏదో సంబంధం ఉంటుంది. పురాణాల్లోనూ కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకితో విడదీయలేని బంధం ఉంటుంది. కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మాల్లో ప్రస్తావిస్తుంటారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి ముట్టాలనే సంప్రదాయం కూడా ఉంది. ఇంతలా మనిషి జీవితంలో భాగమైన కాకి చేసే పనులు మన జీవితంపై ప్రభావం చూపుతుందని కూడా చెబుతుంటారు.
శాస్త్రం ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారనే విశ్వాసంతో ఉంటారు. కాకి ప్రవర్తించే తీరును బట్టి కూడా శుభాశుబాలను అంచనా వేస్తారు. కాకి మన ఇంటి చుట్టూ ప్రవర్తించే తీరు మన భవిష్యత్తును, మన జీవితంలో జరిగే మార్పుల గురించి చెబుతుందని పండితులు చెబుతుంటారు. ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవడం కూడా పరిపాటే. అయితే దీని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ కాకి వల్ల కలిగే ఆ శకునాల గురించి, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది. అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు కాని, ఒకటికి మించి కాపుల గుంపు ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు. ఏదో కీడు జరిగే అవకాశాలున్నాయని భావించాలని చెబుతున్నారు. అలాగే ఒకవేళ కాకి తలపై తన్నితే చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు. ప్రాణ గండం ఉంటుందని, దీనికి తగిన శాంతి చేసుకోవాలని చెబుతున్నారు.
ఒకవేళ మనం బయటకు వెళ్లినప్పుడు ఒకవేళ కాకి కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం. ఒకవేళ కాకి గనక ఎడమ వైపు నుండి కుడి వైపుకు వస్తే అశుభం కలుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బయటకు వస్తున్నప్పుడు కాకి ఎడమవైపు నుంచి కుడివైపు వెళితే.. తిరిగి ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుకొన్ని కాసేపు కూర్చొని మళ్లీ వెళ్లాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన వివరాలు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.
COMMENTS