Hydrogen Fuel: A scooter powered by hydrogen fuel.. Do you know the mileage?
Hydrogen Fuel: హైడ్రోజన్ ఇంధనంతో నడిచే స్కూటర్.. మైలేజీ ఎంతో తెలుసా?
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో స్కూటర్ల నుంచి కార్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటి తక్కువ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం కారణంగా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
అటువంటి పరిస్థితుల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఖచ్చితంగా ఒక ఆశాకిరణం ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం లేదా పెట్రోల్-డీజిల్‌తో నడిచే వాహనం కాదు. వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఎక్స్‌పోలో హైడ్రోజన్‌తో నడిచే స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది ఒక లీటర్ ఇంధనంలో 55 కి.మీ మైలేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఈ స్కూటర్‌లో పెడల్స్ కూడా అందించబడ్డాయి. అవసరమైతే సైకిల్ లాగా ఉపయోగించుకోవచ్చు.
హైడ్రోజన్ ఇంధనంతో కూడిన స్కూటర్ ఎలా పని చేస్తుంది?
ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీతో నడిచే మొదటి స్కూటర్ కాన్సెప్ట్ వెర్షన్‌ను వార్డ్‌విజార్డ్ ఆవిష్కరించింది. ఈ స్కూటర్ భవిష్యత్తులో క్లీన్, ఎఫెక్టివ్ మొబిలిటీకి పునాది వేయగలదు. కానీ ప్రస్తుతం పరిశోధన, అభివృద్ధి దశలో ఉంది. కానీ హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్ తదుపరి తరం యూజర్ యుటిలిటీ వాహనాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది. కంపెనీ ఇటీవల ఏఅండ్‌ఎస్ పవర్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా కంపెనీ తదుపరి తరం Li-ion సెల్ టెక్నాలజీ, GAJA సెల్‌లో పని చేస్తుంది.
ఇదిలా ఉండగా, పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనదారులు సతమతమవుతున్నారు. ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. సింగిల్ ఛార్జింగ్‌తో అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్కూటర్లే కాకుండా కార్లను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు. ముందుగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత వివిధ కంపెనీలు కూడా అదే మార్గాల్లో వెళుతూ సరికొత్త వెర్షన్‌లతో ఈవీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ ఈవీ స్కూటర్లలో కూడా మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, రివర్స్ ఆప్షన్, డిజిటల్ డిస్‌ప్లేలతో పాటు ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు.
COMMENTS