Rythu Bandhu: Good news for the farmers..Rythu Bandhu has received the money..Check it..
Rythu Bandhu: రైతన్నలకు శుభవార్త.. రైతుబంధు డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి..
టీఆర్ఎస్ హయాంలో రైతుబంధు నిధులు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రైతన్నల ఖాతాలో జమ అయ్యేవి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం ఉన్నవాళ్లకు కూడా డబ్బులు జమ కాలేదు.
మూడు వారాల కిందటే డబ్బుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. మొదట 10 గుంటల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో రైతుబంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం.. తర్వాత అర ఎకరం ఉన్నవాళ్లకు నిధులను జమ చేసింది.
ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరం పై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బు జమ కాలేదు. రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం.
నిన్నటి వరకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేశారు అన్నదాతలు. కేవలం గుంటలలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా… ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కాలేదు.
దీంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన వాళ్లకు ప్రస్తుతం వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతన్నల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నారు. మీరు కూడా రైతుబంధు లబ్ధిదారులు అయితే.. మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా.. లేదా అనేది చెక్ చేసుకోండి.
అంతే కాకుండా.. కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా… రెండు రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇక నుంచి రైతుబంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది.
COMMENTS