Tirupati Train Timings: Alert to passengers... Timings of this train going to Tirupati have changed
Tirupati Train Timings: ప్రయాణికులకు అలర్ట్... తిరుపతి వెళ్లే ఈ ట్రైన్ టైమింగ్స్ మారాయి
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. రోజూ పదుల సంఖ్యలో రైళ్లు తిరుపతికి వస్తుంటాయి. తిరుపతికి వెళ్లే ఓ ట్రైన్ టైమింగ్స్ మారాయి.
1. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలనుకునేవారు ఎక్కువగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లేదా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు రైళ్లల్లో టికెట్స్ దొరకనప్పుడే ఇతర రైళ్లల్లో రిజర్వేషన్ చేస్తారు. భారతీయ రైల్వే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మార్చింది.
2. గతంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.05 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు తిరుపతి చేరుకునేది. ప్రస్తుతం ఈ రైలు లింగంపల్లి నుంచి అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ లింగంపల్లి నుంచి తిరుపతికి ప్రయాణిస్తుంది.
3. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఇకపై 12734 నెంబర్ గల నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7.05 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
4. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నల్గొండలో రాత్రి 8.35 గంటలకు, మిర్యాలగూడలో రాత్రి 9 గంటలకు, నడికుడిలో రాత్రి 9.35 గంటలకు, పిడుగురాళ్లలో రాత్రి 10 గంటలకు, సత్తెనపల్లిలో రాత్రి 10.30 గంటలకు, గుంటూరులో రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుంది.
5. కాబట్టి భారతీయ రైల్వే ప్రయాణికులు మారిన టైమింగ్స్‌ను గమనించి అందుకు తగ్గట్టుగా తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. లింగంపల్లిలో బయల్దేరే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ దారిలో బేగంపేట్, సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
6. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలనుకునేవారు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. ఈ రైలు రాత్రి 8.05 గంటలకు కాచిగూడలో బయల్దేరితే, మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇదే రైలు ఉదయం 8.55 గంటలకు చిత్తూరు చేరుకుంటుంది.
7. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దారిలో ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల జంక్షన్, క్రనూల్ సిటీ, ఢోన్ జంక్షన్, గుత్తి జంక్షన్, తాడిపత్రి, ముద్దనూరు, ఎర్రగుంట్ల జంక్షన్, కమలాపురం, కడప జంక్షన్, రాజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది.
8. ఇవే కాకుండా మరిన్ని రైళ్లు తిరుపతికి అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు రూట్లల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తాయి. సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందే భారత్ రైలు కూడా అందుబాటులో ఉంది. మంగళవారం తప్ప మిగతా ఆరు రోజుల్లో వందే భారత్ ట్రైన్ సేవలు అందిస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే, మధ్యాహ్నం 2.34 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
COMMENTS