Old Gold Jewellery: Selling old jewellery? Remember these rules
Old Gold Jewellery: పాత నగలు అమ్ముతున్నారా? ఈ రూల్స్ గుర్తుంచుకోండి
Old Gold Jewellery | మీరు పాత నగల్ని అమ్ముతున్నారా? మీ దగ్గరున్న పాత గోల్డ్ జ్యువెలరీ అమ్మే ముందు కొన్ని నియమనిబంధనలు గుర్తుంచుకోండి.
1. డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ కొని దాచుకోవడం, డబ్బు అవసరం అయినప్పుడు బంగారు నగల్ని (Gold Jewellery) అమ్మడం భారతీయ కుటుంబాలకు అలవాటే. తరతరాలుగా ఈ అలవాటు ప్రజల్లో ఉంది. అయితే బంగారానికి సంబంధించి కొత్తకొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు.
2. ఇప్పటికే బంగారు నగలు అమ్మడం కోసం కొత్త నిబంధనల్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హాల్‌మార్క్ ఉన్న నగల్ని మాత్రమే అమ్మాలని ఆదేశించింది. అంతేకాదు... హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) అమలు చేస్తోంది. భారతదేశంలోని 343 జిల్లాల్ని కొత్త హాల్‌మార్క్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ జిల్లాల్లో హాల్‌మార్క్ ఉన్న నగలనే యజమానులు అమ్మాలి.
3. బంగారు నగల స్వచ్ఛతను తెలిపే ముద్రను హాల్‌మార్క్ అంటారన్న విషయం నగలు కొనేవారికి తెలుసు. గతంలో నాలుగు ముద్రలు ఉండేవి. కానీ కొన్నాళ్ల క్రితం హెచ్‌యూఐడీని తీసుకొచ్చింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. కొత్త నిబంధనల ప్రకారం మూడు గుర్తులు ఉంటాయి.
4. బీఐఎస్ రూపొందించిన గుర్తుల్లో మొదటిది త్రిభుజాకారంలో బీఐఎస్ హాల్‌మార్క్ గుర్తు ఉంటుంది. రెండోది నగల్లో బంగారం స్వచ్ఛతను తెలియజేసే 18K, 22K అనే ముద్ర ఉంటుంది. మూడోది ఆరు డిజిట్స్ గల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌తో HUID ఉంటుంది. ఈ కోడ్ ప్రతీ నగపై భిన్నంగా ఉంటుంది.
5. భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా వారసత్వంగా వస్తున్న నగలు ఉంటాయి. వాటిపై హాల్‌మార్క్ ఉండదు. మరి హాల్‌మార్క్ లేని నగల పరిస్థితి ఏంటీ? వాటిని అమ్మాలన్నా, ఎక్స్‌ఛేంజ్ చేయాలంటే ఎలా? అనే డౌట్ అందరిలో ఉంది. మీరు ఒకవేళ పాత నగల్ని అమ్మాలన్నా, ఎక్స్‌ఛేంజ్ చేయాలన్నా వాటిపై హెచ్‌యూఐడీ ముద్ర వేయించాలి.
6. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ ఆభరణాలకు పాత హాల్‌మార్క్ అంటే హెచ్‌యూఐడీ అమలులోకి రాకముందు ఉన్న హాల్‌మార్క్ ముద్ర ఉన్నట్టైతే, మీరు మళ్లీ హాల్‌మార్కింగ్ వేయించాల్సిన అవసరం లేదు. ఈ నగల్ని మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మొచ్చు లేదా ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గరున్న నగల్లో ఎలాంటి హాల్‌మార్క్ లేకపోతే మాత్రం హెచ్‌యూఐడీ తప్పనిసరి.
7. హాల్‌మార్క్ లేని పాత బంగారు ఆభరణాలు మీ దగ్గర ఉన్నట్టైతే దాని స్వచ్ఛతను తనిఖీ చేయించాలి. BIS గుర్తించిన ఏదైనా హాల్‌మార్కింగ్ సెంటర్‌లో తనిఖీ చేయవచ్చు. ఆభరణాల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రతీ ఆర్టికల్‌కు రూ.45 చెల్లించాలి. ఒక లాట్‌లో నాలుగు ఆభరణాలు ఉంటే రూ.200 చార్జీ చెల్లించాలి. బీఐఎస్ సంస్థలో రిజిస్టర్ అయిన నగల వ్యాపారి ద్వారా కూడా ఆభరణాలపై హాల్‌మార్క్ ముద్ర వేయించవచ్చు.
COMMENTS