Deepinder Goyal: Address to success.. this delivery boy! Per day Rs. Earning crores..!!2023
Deepinder Goyal: సక్సెస్‌కి చిరునామా.. ఈ డెలివరీ బాయ్! రోజుకి రూ. కోటి సంపాదిస్తున్నాడిలా..!!
Deepinder Goyal: ఒకప్పుడు ఆకలైతే వంట గదివైపు తిరిగే కళ్ళు.. ఇప్పుడు ఆకలేస్తే మొబైల్ వంక చూస్తున్నాయి. ఎందుకంటే జొమాటో మరియు స్విగ్గీ వంటి ఆన్ లైన్ యాప్స్ లో ఆర్డర్ పెడితే నిమిషాల్లో ఆర్డర్ మన గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. ఆధునిక కాలంలో అంతగా పాపులర్ అయినా ఈ జొమాటో ఎవరు స్టార్ట్ చేసారు? ఆయన హిస్టరీ ఏంటి? అయన సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఇలా ఆర్డర్ పెడితే ఆలా మన ముందుకు వచ్చే జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ స్థాపించింది ఒకప్పుడు తరగతిలో వెనుకబడిన ఒక స్టూడెంట్ అంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇది అక్షర సత్యం. పంజాబ్ ముక్త్‌సర్ జిల్లాలో జన్మించిన దీపిందర్ గోయల్ చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్.
అయితే ఒకసారి పరీక్షల్లో ఇన్విజిలేటర్ సాయంతో పెయిల్ అవ్వాల్సిన వ్యక్తి మూడవ ర్యాంక్ తో పాసయ్యాడు. నిజం చెప్పాలంటే ఇదే అతని జీవితానికి పెద్ద మలుపు. ఆ తరువాత కస్టపడి చదివి మెరిట్ స్టూడెంట్స్ లిస్ట్ లో ఒకడిగా నిలిచాడు. ఆ తరువాత ఐఐటీ కోసం చండీగఢ్ వెళ్ళాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో పోటీ పడలేక ఇంటికి తిరిగి వచ్చేసాడు, కానీ కర్తవ్యం కళ్లెదుట ఉంటే నిద్ర రాదు కదా అనే నానుడి ప్రకారం మళ్ళీ ఢిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు.
దీపిందర్ గోయల్ జీవితం నిజంగానే ఒక సినిమా తలపిస్తోంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎన్నెన్నో అడ్డంకులు, ఆటంకాలు ఎదుర్కొంటూ చివరికి విజయ శిఖరాలను అధిరోహించాడు. జొమాటో స్థాపించి ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజు డెలివరీ యాప్ లో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. అతని కంపెనీ నికర విలువ ఏకంగా 1 బిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం.
కరోనా మహమ్మారి సమయంలో డెలివరీ పార్ట్‌నర్స్ చదువుల ఫీజుల కోసం 700 కోట్ల రూపాయల విలువైన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చేసాడు ఇప్పటి వరకు చెఫ్‌కార్ట్, అన్‌అకాడెమీ వంటి వాటితో పాటు సుమారు 16 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. జొమాటో 2021లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది, ఆ తరువాత దీపిందర్ గోయల్ నికర విలువ 650 మిలియన్ డాలర్లకు చేరింది.
అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 5345 కోట్ల కంటే ఎక్కువ. ప్రస్తుతం కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా జీతం కూడా తీసుకునేది లేదని చెబుతున్నారు. కాగా కంపెనీలు అతై వాటా 4.7 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యితడు ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్స్ కింద రూ. 358 కోట్లు అందుకున్నాడు. అంటే అతడు రోజుకి రూ. కోటి సంపాదిస్తున్నట్లు లెక్క.
ప్రస్తుతం జొమాటోలో పనిచేసే డెలివరీ బాయ్స్ నెలకు సగటున 40,000 నుంచి 50,000 సంపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జొమాటో కంపెనీకి సీఈఓ అయినా గోయల్ అప్పుడప్పుడు జొమాటో డెలివరీ బాయ్ అవతారం కూడా ఎత్తుతాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డెలివరీ బాయ్ అని రాసుకున్నాడు. కాగా ప్రస్తుతం జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 66,874 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు వారధి చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
COMMENTS