No minimum balance required in this SBI account.. No card charges..!
ఈ SBI ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు.. ఆ కార్డు ఛార్జీలూ ఉండవు..!
SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా యాన్యువల్ డెబిట్ కార్డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇవేమీ అవసరం లేని ఓ సేవింగ్స్ ఖాతాను అందుబాటులోకి తెచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐలో ఆ సేవింగ్స్ అకౌంట్ సులువుగా తెరవొచ్చు. ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ (SBI Insta Plus Savings Account) పేరుతో ఈ ఖాతా అందుబాటులో ఉంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ ద్వారానే ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు.
ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫారాలు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే సులువుగా ఓపెన్ చేయొచ్చు. ఆధార్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. వీడియో కేవైసీ ప్రాసెస్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. డిజిటల్ సిగ్నేచర్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. కస్టమర్లు నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు జరపొచ్చు. యోనో ఎస్‌బీఐ, ఆన్‌లైన్ ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ ఆప్షన్‌తో కూడా ఈ ఖాతా తెరవొచ్చు.
ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి రూపే క్లాసిక్ డెబిట్ కార్డ్ అందిస్తుంది బ్యాంక్. ఈ కార్డుకు ఎలాంటి యాన్యువల్ డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఉండవు. మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తించవు. కస్టమర్లు యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 24 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ సదుపాయు ఉపయోగించుకోవచ్చు.
ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ తెరిచేందుకు యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత New To SBI ఆప్షన్ క్లిక్ చేయాలి. Open Savings Account ఆప్షన్ ఎంచుకోవాలి. Without Branch visit ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సాలరీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే I want to open a salary account ఆప్షన్ టిక్ చేయాలి.ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. మీ పాన్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇతర వివరాలు ఎంటర్ చేసి వీడియో కాల్ షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ చేసిన టైమ్‌లో వీడియో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీ పేరు మీద ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
COMMENTS