Making Youtube videos? Do you know how many subscribers you can earn? Full calculations..
Youtube వీడియోలు చేస్తున్నారా? ఎందరు సబ్‌స్క్రైబర్లు ఉంటే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా? పూర్తి లెక్కలివే..
Youtube Videos Download: డబ్బు సంపాదించాలంటే మంచి ఉద్యోగం ఉండాలి. మంచి జీతం రావాలంటే మంచి చదువుకు తోడు ప్రతిభ ఉండాల. ఏదైనా ఉద్యోగం రావాలంటే కనీస విద్యార్హతలు ఉండాలి. అయితే చదువుతో సంబంధం లేకుండా ఒక యాప్‌తో కొందరు నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్ ఏంటో తెలుసా .. యూట్యూబ్. కొద్దిగా సృజనాత్మకత, కొద్దిగా ప్రతిభ ఉంటే చాలు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. రకరకలా కంటెంట్ అందులో పోస్ట్ చేస్తున్నారు ఔత్సాహికులు.
ఒక యూట్యూబ్ ఛానెల్‌కు సబ్‌స్క్రైబర్స్ పెరగాలన్నా.. వ్యూయర్‌షిప్ రావాలాన్నా వాళ్లు అప్‌లోడ్ చేసే కంటెంట్ చాలా బాగుండాలి. కొందరు కామెడీ, ఇంకొందరు గేమింగ్.. ఇంకొందరు వంటలు, ఫ్యాషన్ ఇలా రకరకాల కంటెంట్‌తో యూజర్స్‌కు కావాల్సిన వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు దీంతో కొంతకాలంలోనే ఫేమస్ అవుతున్నారు. ఇలా యూట్యూబ్‌తో డబ్బు సంపాదించడం అంత సులువు కాదని గుర్తుంచుకోవాలి. కంటెంట్‌లో కొత్తదనం, వైవిధ్యం ఉంటేనే ఆ వీడియోలకు ఆదరణ లభిస్తుంది. దాంతో ఛానెల్‌కు సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇవే యూట్యూబ్‌కు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరులు. అయితే.. ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్‌ను బట్టి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం.
ఏదైనా యూట్యూబ్ ఛానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే ఆ యూట్యూబర్‌కు సుమారు రూ .2 లక్షల నుంచి రూ. 3.30 లక్షల వరకు సొమ్ము చెల్లిస్తుంటుంది యూట్యూబ్. అయితే ఈ చెల్లింపులు ఒక్కో ఛానెల్ పోస్ట్ చేసేటువంటి కంటెంట్‌కు వచ్చిన వ్యూస్, ఆ ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది. అలా యూట్యూబర్ నెలకు లక్షల్లో సంపాదిస్తుంటారు.
ఇప్పుడు మనం చూసే వీడియోల్లో చాలా వరకు యాడ్స్ వస్తుంటాయి. వీటినే పెయిడ్ ప్రమోషన్స్ అంటారు. అంటే యూట్యూబర్ ఫేమస్ అయితే అతడితో ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్స్ ప్రచారం చేయించుకుంటుంది. అలా వస్తువును ప్రమోట్ చేసిన కంపెనీ నుంచే కాకుండా యూట్యూబ్ నుంచి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇలా యాడ్స్, స్పాన్సర్‌షిప్స్ సహా బిజినెస్‌కు సంబంధించిన వీడియోస్‌ను కంటెంట్ మొదట్లో లేదా మధ్యలో అప్‌లోడ్ చేసిన ఛానెల్స్ మానిటైజ్ చేసుకునే వీలు కల్పిస్తుంది యూట్యూబ్.
యూట్యూబ్‌లో ఛానెల్ మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే సదరు ఛానెల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబర్లుండాలి. ఇలా యూట్యూబ్ నిబంధనల ప్రకారం వారు అన్ని అర్హతలు సాధిస్తే.. సదరు యూట్యూబ్ ఛానెల్‌కు యాడ్‌సెన్స్ అప్రూవ్ అవుతుంది. దీంతో యూట్యూబర్‌కు ఆ యాడ్ రెవెన్యూలో కొంత భాగం యూట్యూబ్ ఇస్తుంది. ప్రకటనలు (యాడ్స్), షాపింగ్, ఛానెల్ మెంబర్‌షిప్స్, యూట్యూబ్ ప్రీమియం, సూపర్ చాట్ అండ్ సూపర్ స్ట్రికర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ యూట్యూబ్ ఆదాయ మార్గాలు.
COMMENTS