Dr Reddy's Foundation: Applications are invited for Free Training in Solar Panel Installation
Dr Reddy’s Foundation: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.
ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుంది. అయితే శిక్షణ కోసం ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పేరు నమోదు చేసుకోవడానికి ఫోన్ నెంబర్లు: 9964131921, 8019050334ను సంప్రదించవచ్చు. ఈ కోర్సులో భాగంగా సౌర విద్యుత్తును ఏ విధంగా తయారు చేస్తారు..? ఏలా ఏర్పాటు చెయ్యాలి..? వీటి సూత్రాలు ఏంటి? అన్నవాటిపై శిక్షణ ఇస్తారు.
సౌర విద్యుత్ అంటే..
సూర్య రష్మి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సౌర విద్యుత్ అంటారు. సౌర విద్యుత్ మొట్టమొదటిసారి 1980 దశకంలో ప్రారంభమైంది. వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు నిర్మాణంలోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ప్రతి సంవత్సరం 2050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. సూర్యుని నుంచి దాదాపు 174 పెటావాట్ల శక్తి గల సూర్యకిరణాలు భూమికి వెలువడతాయి. ఇందులో 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా 70 శాతం వేడిని సముద్రాలు మేఘాలు, భూమి గ్రహించుకుంటాయి. ఫోటో వోల్టాయిక్ ఘటాల నుంచి కానీ, ఉష్ణోగ్రత భేదాన్ని యంత శక్తిగా మార్చే హీట్ ఇంజన్ ల నుండి కానీ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.
COMMENTS