So many crores were collected in the name of minimum balance? If you know the accounts of the banks, eggs will float.
Minimum Balance in Banks: అమ్మ బాబోయ్.. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో ఇన్ని కోట్లు వసూలు చేశారా? బ్యాంకుల లెక్కలు తెలిస్తే గుడ్లు తేలేస్తారు..
బ్యాంకులో డబ్బులు వేసినా ఛార్జీలే.. డబ్బులు తీసినా ఛార్జీలే.. ఆఖరికి అందులో డబ్బులు లేకపోయినా ఛార్జీలు.. ఇలా అన్ని విధాలుగానూ కస్టమర్లను డబ్బులు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఇవే కాదండోయ్.. ఏటీఎం కార్డ్ యూజింగ్ పేరుతో, ఏటీఎం కార్డ్ క్యాన్సలేష్, కార్డ్ ఛేంజ్, ఇల రకరకాలుగా వసూలు చేస్తున్నారు. అయితే, తాజాగా బ్యాంకుల ఛార్జీలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఒక్క మినిమం బ్యాలెన్స్ మెయింటేనెన్స్ పేరుతోనే కొన్ని వేల కోట్లు వసూలు చేశాయి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
మరి ఆ లెక్కల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రభుత్వ రంగ బ్యాంకులు, 5 ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, అదనపు ATM లావాదేవీలు, SMS సేవల పేరుతో 2018 నుండి ఇప్పటి వరకు రూ. 35,000 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, 5 ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు ( యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్) సేకరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ రాతపూర్వక ప్రతిస్పందనలో భాగంగా సమర్పించిన డేటా వెల్లడించింది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో రూ. 21,000 కోట్లు, ఉచిత అవకాశాలను మించి ఎటిఎం ద్వారా లావాదేవీలు చేసినందుకు రూ. 8,000 కోట్లకు పైగా వసూలు చేయగా, SMS ఛార్జీలు రూ. 6,000 కోట్లకు పైగా వచ్చాయి.
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ఉచిత లావాదేవీలకు మించి ఏటీఎంలను ఉపయోగించడం, పరిమితికి మించి నగదు డిపాజిట్ చేయడం వంటి వాటికి బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయనే విషయం తెలిసిందే. బ్యాంకుల నిబంధనల ప్రకారం.. కస్టమర్ ప్రతి నెలా వారి వారి ఖాతాల్లో నిర్వహించాల్సిన మొత్తం అమౌంట్ను ఉంచాలి. లేదంటే ఫైన్ పడుతుంది. ఇది మెట్రో నగరాలు, చిన్న నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు పరిమితులు, ఛార్జీలు వేరుగా ఉంటుంది. ఒకవేళ ఆ మొత్తం లేకపోతే.. బ్యాంకులు సదరు కస్టమర్లకు పెనాల్టీ విధిస్తాయి.
వివిధ బ్యాంకులు మెట్రో నగరాల్లో మినిమం బ్యాలెన్స్ రూ. 3,000 – రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,000- రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500-రూ.1,000 మధ్య ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మెయింటేన్ చేయకపోతే రూ. 400- రూ. 500 మధ్య ఛార్జీలు విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు AMB ఛార్జీలతో పాటు.. ప్రతి లాబాదేవీలపై రూ. 100 – రూ. 125 ఛార్జీలను విధిస్తాయి. ఈ ఛార్జీలు ఆర్బీఐ ఆమోదం మేరకే బ్యాంకులు వసూలు చేస్తుంటాయి.
ఇక బ్యాంకు కస్టమర్లు తమ సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీవీల నుంచి కూడా నిర్ణీత సంఖ్యలో ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మెట్రో సెంటర్లలో 3 లావాదేవీలు, నాన్ మెట్రో సెంటర్లలో 5 లావాదేవీలు ఫ్రీగా చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉచితి లావాదేవీలకు మించి ప్రతి ఏటీవీ ట్రాన్సాక్షన్‌కి ఛార్జీలు విధించడం జరుగుతుంది. కస్టమర్ ఛార్జీలపై సీలింగ్/క్యాప్ ఒక్కో లావాదేవీకి రూ. 21 వసూలు చేయడం జరుగుతుంది. ఇది 1 జనవరి, 2022 నుంచి అమల్లోకి వచ్చింది.
COMMENTS