Mailing documents for Aadhaar update..? UIDAI does not want
ఆధార్ అప్డేట్ కోసం డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తున్నారా..? వద్దంటున్న UIDAI
అన్నింటికి ఆధార్ కార్డు కావాలి, ఇండియాలో ఆధార్ లేనిదే మనకు అసలు గుర్తింపే లేదు అనడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా..! పైగా ఈ ఆధార్‌ను పాన్ కార్డుతో , బ్యాంకు అకౌంట్‌తో, రేషన్ కార్డుతో కూడా లింక్ చేయాలి. లేకపోతే పనులు కావే..! ఇదిలా ఉంటే.. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఆధార్‌లో వస్తుంటుంది. ఆధార్ కార్డు కలిగిన వారికి అలర్ట్. యూఐడీఏఐ (UIDAI) కీలక ప్రకటన చేసింది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని కోరుతోంది. స్కామ్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
ఇలా చేయవద్దు..
ఆధార్ అప్‌డేట్ ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లను ఈమెయిల్స్ చేయడం వంటివి చేయవద్దని కోరింది. యూఐడీఏఐ ఎప్పుడూ ఇలా డాక్యుమెంట్లు మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని అడగదని తెలిపింది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారు దగ్గరిలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించింది. ఇంకా ఆన్‌లైన్‌లో అయితే యూఐడీఏఐ మై ఆధార్ వెబ్‌సైట్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ ఈ విషయాన్ని తెలిపింది. యూఐడీఏఐ ఎప్పటికీ పీఓఐ/పీఓఏ డాక్యుమెంట్లను అప్‌డేటో కోసం ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపమని కోరదని తెలిపింది. ఆధార్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీ డాక్యుమెంట్లను అప్‌డేట్ కోసం ఎవ్వరికీ ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపొద్దు.
ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటితే అప్పుడు వివరాలను లేదా బయోమెట్రిక్స్ ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్ల అథంటికేషన్ ఫెయిల్ సమస్య ఉండదు. మీరు ప్రస్తుతం ఉచితంగానే ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. 2023 సెప్టెంబర్ 14 వరకు మీకు వివరాల ఉచిత అప్‌డేట్‌కు అవకాశం ఉంది. సాధరణంగా అయితే ఈ ఆప్షన్ జూన్ 14తోనే ముగియాల్సి ఉంది. అయితే యూఐడీఏఐ ఈ ఫెసిలిటీని పొడిగించింది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌కు మాత్రమే ఈ ఉచిత ఆప్షన్ లభిస్తుంది. మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేసుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.
COMMENTS