Whatsapp key feature release.. Can chat without saving phone number.
Whatsapp కీలక ఫీచర్ విడుదల.. ఫోన్ నంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేయవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకుండానే వారికి వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్ అడ్రస్ బుక్‌లో నంబర్ సేవ్ చేయకుండానే వారితో చాట్ చేయవచ్చు.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఏదైనా కొత్త ఫోన్ నంబర్‌ను సెర్చ్ చేయడం ద్వారా ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందు కోసం యూజర్లు తమ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
అక్కడ కొత్త చాట్ ప్రారంభించు అనే బటన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. అక్కడ మీ ఫోన్‌లో సేవ్ చేయని నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ నంబర్‌కు వాట్సాప్ ఉంటే వారితో అక్కడికక్కడే మీరు చాట్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా వ్యక్తిగత భద్రత మరింత మెరుగుపడుతుంది. కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అవసరాల కోసం కొందరికి వాట్సాప్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో వారి నంబర్‌ను కచ్చితంగా సేవ్ చేయాల్సి వచ్చేది. పని అయిపోయాక వారి నంబర్‌ను తొలగించడం చాలాసార్లు మర్చిపోతాం. ఫలితంగా వారు మన ప్రొఫైల్ సహా ఇతర వివరాలను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
అదే ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకుండానే వాటితో చాట్ చేయవచ్చు. ఫలితంగా భవిష్యత్‌లో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్ అందరికి విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా అప్‌గ్రేడ్ చేసిన వారికే అందుబాటులోకి వచ్చింది. అయితే అతి త్వరలోనే ఈ ఫీచర్ మిగిలిన అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
వాట్సాప్ గత కొంత కాలంగా అనేక రకాల ఫీచర్లను వరుసగా విడుదల చేస్తుంది. యానిమేటెడ్ ఫీచర్‌ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాంతోపాటు QR కోడ్ స్కాన్ చేయకుండానే వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ అయ్యే ఫీచర్‌ను విడుదల చేసింది. మొబైల్ నంబర్ ఆధారంగా కనెక్ట్ కావచ్చు. ఇందుకు 8 అంకెల నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ డేటాను బదిలీ చేసుకొనే ఫీచర్‌ను విడుదల చేసింది. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా చాట్‌ను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారుడు పాత ఫోన్ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అందులోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన చాట్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకొని, QR కోడ్‌ను స్కాన్‌చేయాలి. కొత్త ఫోన్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.
వాట్సాప్ ఇటీవల చాలా ఫీచర్లను విడుదల చేసింది. చాట్ లాక్, తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ నియంత్రించే ఫీచర్, దాంతోపాటు వాట్సాప్ నుంచి HD వీడియోలు, ఫోటోలను పంపించే ఫీచర్ విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
COMMENTS