ISRO: How to get a job in ISRO? Here are the ways..
ISRO: ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం ఎలా? ఇవిగో మార్గాలు..
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఉండే క్రేజే వేరు. అందులోనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని దేశ యువత ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలా ? మొదట ఏడాదికి మూడు సాయిలు ఇస్రో మెయిన్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో ఇస్రో వెబ్సైట్ ద్వారా జాబ్ వేకెన్సీస్ గురించి వివరాలు ప్రకటన వస్తుంది.. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేసి ఏ క్వాలిఫికేషన్ కు ఏ తరహా ఉద్యోగాలు కావాలో ఆ తరహా అప్లికేషన్ నందు మనము ఫిల్ చేయాలి.
ఇస్రో నిర్వహించే ప్రవేశ పరీక్షలు నందు మొదట హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినవారు నేరుగా ఇంటర్వ్యూకు ఇస్రో కేటాయించిన తేదీల్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇస్రోలో వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాలు ఉంటాయి .అందులో ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్స్ చదివిన వారికి ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొట్ట మొదట 20,000 రూపాయలు నుండి 2 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది.. ఇస్రోకి దేశ వ్యాప్తంగా అనేక విభాగాలు ఉన్నాయి.. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతుంటాయి.. ఇది అందరికీ తెలుసు..
కానీ ఆ ప్రయోగాలు జరిగిన అనంతరం ఉపగ్రహాలు మానిటరింగ్ మొత్తం బెంగళూరు ఇస్రో సెంటర్ నుంచి జరుగుతాయి.. అలాగే కేరళలోని త్రివేండ్రం లో ఉపగ్రహాలు తయారీ జరుగుతుంటాయి.. తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి నుంచి ఇస్రో సొంత పరిజ్ఞానం తో తయారు చేసిన రాకెట్ ఇంజన్ల పరీక్షలు జరుగుతుంటాయి.. ఇక చెన్నై సహా ఢిల్లీలో కూడా ఇస్రో అనుబంధంగా అనేక విభాగాలు పని చేస్తుంటాయి.
ఇస్రో లో జాబ్ సంపాదిస్తే స్థాయిని బట్టి క్వార్టర్స్, వాహన సదుపాయం, కార్పొరేట్ తరహా ఆస్పత్రులు, ఇక కీలక ప్రయోగాల సందర్భంలో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి..
ఇలా ఎప్పటికప్పుడు ఇస్రో వైబ్సైట్ ను గమనిస్తుంటే ఇస్రోలో ఉద్యోగం చేసే అవకాశం దక్కుతుంది. ఇస్రోలో ఉద్యోగం సంపాదించేందుకు యువత ఎంతో ఆసక్తి కరంగా ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే ఎలా అనేది తెలియక చాలామంది అవకాశాలను పొందలేక పోతుంటారు.. ఇటీవల కాలంలో ఐటి ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఆరంగంలో ఉద్యోగ భద్రత లేని కారణంగా ఇస్రో వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా రిక్రూట్మెంట్ చెబుతోంది.. సో ఇంకెందుకు ఆలస్యం ఇస్రో వెబ్సైట్ వైపు ఎప్పటికప్పుడు ఓ లుక్ వేస్తే మీకు ఆ లక్కు తగలొచ్చు.
ISRO: ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడమే మీ లక్ష్యమా.? అయితే, ఈ మూడు దారులు మీ కోసమే.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో(ISRO) ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థలలో ఒకటి. తక్కువ ఖర్చుతో అంతరీక్ష ప్రయోగాలు చేసే సంస్థగా మన ఇస్రోకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.
మన శ్రీహరికోట నుంచే ప్రయోగాలు జరుగుతుంటాయి. శ్రీహరికోట అనే దీవి విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుమార్గంలో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఆగష్టు 15, 1969న ఇస్రో స్థాపించారు. రేపు చంద్రయాన్-3 మిషన్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభమైన సమయంలో అసలు ISROలో శాస్త్రవేత్తగా ఎలా మారాలో తెలుసుకోండి.
ఇస్రో సైంటిస్ట్‌గా మారడానికి మూడు దారులున్నాయి:
1) ప్రతి సంవత్సరం, IISc, IITలు, NITల నుంచి ISRO రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంది . ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ B.Tech విద్యార్థులను ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
2) IIST (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ)లో సీటు పొందడం ISROలో చేరడానికి వేగవంతమైన మార్గం. ప్రతి సంవత్సరం, ఇస్రో వారి అవసరాల ఆధారంగా IIST విద్యార్థులను నేరుగా శాస్త్రవేత్తలుగా ఆహ్వానిస్తుంది. అయితే, ISRO కోసం పరిగణించబడాలంటే, మీరు తప్పనిసరిగా 7.5 CGPAని కలిగి ఉండాలి.
3) ఇస్రో ప్రతి సంవత్సరం ICRB (ISRO సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్) పరీక్షను నిర్వహిస్తుంది. BE, BTech, BSc(Engg), లేదా డిప్లొమా + BE/BTech (లేటరల్ ఎంట్రీ) పూర్తి చేసిన తర్వాత, మీరు ఈ పరీక్షలో పాల్గొనవచ్చు. అయితే, కంప్యూటర్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్‌ల నుంచి విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు.
ఉద్యోగాలు , భారీ జీతం
12వ తరగతి తర్వాత ఇస్రోలో చేరడం ఎలా?
12వ తరగతి తర్వాత ISROలో చేరడానికి మీరు తీసుకోగల మూడు పరీక్షల్లో ఒకటి JEE అడ్వాన్స్‌డ్, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన లేదా IISER ద్వారా తీసుకున్న రాష్ట్ర, సెంట్రల్ బోర్డ్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్.
ఇస్రోలో సైంటిస్ట్‌గా మారడానికి కోర్సులు?
ఇస్రోలో సైంటిస్ట్ కావడానికి అభ్యర్థులు ఈ కోర్సుల్లో దేనినైనా అభ్యసించవచ్చు:
a) ఏవియానిక్స్ ఇంజినీరింగ్‌లో బి.టెక్
b) B.Tech+MS/M.Tech
c) బ్యాచిలర్స్ ఇన్ ఫిజిక్స్ (BSc ఫిజిక్స్)
d) భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ (MSc ఫిజిక్స్)
e) Ph.D. భౌతికశాస్త్రంలో
f) బి.టెక్. ఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో + సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఎర్త్ సిస్టమ్ సైన్స్/ M.Techలో MS. ఆప్టికల్ ఇంజనీరింగ్‌లో
g) ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బి.టెక్
h) Ph.D. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో
i) ఖగోళ శాస్త్రంలో మాస్టర్స్ (MSc ఆస్ట్రానమీ)
j) Ph.D. ఖగోళ శాస్త్రంలో
k) ఇంజినీరింగ్‌లో B.Tech + M.Tech (మెకానికల్, ఎలక్ట్రికల్, CS)
COMMENTS