Indian Railways: Railway travel with too much luggage..? Heavy fines are guaranteed if the limit is exceeded.. How much weight can be carried..?
Indian Railways: ఎక్కువ లగేజీతో రైల్వే ప్రయాణమా..? లిమిట్ దాటిందంటే భారీ ఫైన్‌లు ఖాయం.. ఎంత బరువు తీసుకెళ్లొచ్చంటే..?
Indian Railways: బడ్జెట్ ధరలోనే సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలంటే అందరి ఎంచుకునే వచ్చే ఒకే ఒక్కటి ఇండియన్ రైల్వేస్. దాదాపు 140 కోట్ల మంది ఉన్న మన భారతదేశంలో అందరినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే అనేక రైళ్లను నడుపుతోంది. ఇంకా ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కూడా ఎన్నో నియమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో సమీప దూరాలకు వెళ్లేవారు కూడా లగేజీని ఎక్కువగా కారీ చేస్తుంటారు. అలా ఎక్కువ లగేజీతో ప్రయాణం చేయడం వల్ల కొన్ని సార్లు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది, ఆసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ కారణంగానే లగేజీ విషయంలో కూడా లిమిట్ ఉండేలా ఓ రూల్‌ని అమలు చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఆ రూల్ పాటించనివారికి భారీ మొత్తంలో ఫైన్ విధిస్తుంటుంది. మరి ఆ రూల్ ప్రకారం ఇండియన్ రైల్వేస్‌లో ఎంత లగేజీతో ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం ప్రయాణికులు తమతో పాటు 70 కిలోల బరువు కలిగిన లగేజీని తీసుకువెళ్లవచ్చు. కానీ అంతకు మించి ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. ఎక్కువ లగేజీతో ప్రయాణించినవారికి భారీ మొత్తంలో ఫైన్ విధించేందుకు టీసీకి అనుమతి ఉంది. అయితే 70 కిలోల లగేజీ అనేది ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. అదే ఏసీ టూ టైర్‌లో ప్రయాణిస్తున్నట్లయితే 50 కిలోలు.. స్లీపర్ క్లాస్ ప్రయాణం అయితే 40 కేజీల బరువున్న లగేజీతో ప్రయాణించవచ్చు. అందువల్ల అవసరానికి మించిన లగేజీతో రైళ్లలో ప్రయాణించకూడదని గుర్తుంచుకోవాలి. లేదా ఎక్కువ లగేజీ ఉన్నసందర్భంలో తప్పకుండా లగేజ్ వ్యాన్‌ను బుక్ చేసుకోవాలని కూడా గమనించాలి. లేదా ఫైన్ కట్టక తప్పదని కూడా గుర్తుంచుకోవాలి.
Post a Comment