BEL Recruitment: BTech Eligibility.. Jobs in Bharat Electronics Limited..
BEL Recruitment: బీటెక్ అర్హత.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ - I మరియు ట్రైనీ ఇంజనీర్ - I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(Engineering Graduate) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2023. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలిలా..
మొత్తం 205 పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వీటిలో 191 ఖాళీలు ట్రైనీ ఇంజనీర్ - I పోస్టులు కాగా.. మరో 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ - I పోస్టులు ఉన్నాయి. . వివరాలను తెలుసుకోవడానికి.. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును చూడవచ్చు. మీరు నోటీసును చూడడానికి దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్‌పై కూడా క్లిక్ చేయవచ్చు.
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BE, B.Tech, B.Sc (నాలుగేళ్లు) డిగ్రీని పొంది ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌కు సంబంధించిన మరేదైనా కోర్సు చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి 55 శాతం మార్కులు ఉండటం కూడా అవసరం. వయోపరిమితి విషయానికొస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ I పోస్టుకు వయోపరిమితిని 32 సంవత్సరాలుగా మరియు ట్రైనీ ఇంజనీర్ I పోస్టుకు వయోపరిమితిని 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఎంపిక ఇలా..
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు వెళతారు. రెండు దశలను క్లియర్ చేసిన అభ్యర్థి ఎంపిక చివరిగా పరిగణించబడుతుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS