Google Account: Doubt that someone is using your Google account..? Check this..
Google Account: మీ గూగుల్ అకౌంట్‌ను ఎవరైనా యూజ్ చేస్తున్నారని డౌట్ ఉందా..? ఇలా చెక్ చేసుకోండి..
ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ యూజర్ లైఫ్‌లో గూగుల్ సర్వీస్‌లను వినియోగించని రోజు ఉండదు. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, క్రోమ్.. ఇలాంటి గూగుల్ ప్రొడక్టులు అంతగా నెటిజన్ల జీవితాల్లో భాగమైపోయాయి.
యూజర్లకు తమ అకౌంట్‌లపై గూగుల్ పూర్తి కంట్రోలింగ్ అందిస్తుంది. దీని ద్వారా డివైజ్‌లను రిమోట్‌గా మానిటర్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు. అలాగే కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా, గుర్తు తెలియని వ్యక్తులు తమ గూగుల్ అకౌంట్‌ను (Google Account) యాక్సెస్ చేస్తున్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అకౌంట్ సెక్యూరిటీ మెరుగుపరచడానికి, అదనపు ప్రొటెక్షన్ లేయర్ యాడ్ చేయడానికి చర్యలు తీసుకోవచ్చు.
* అనాథరైజ్డ్ యాక్సెస్ ఎలా చెక్ చేయాలి?
- ఇతరులు ఎవరైనా మీ గూగుల్ అకౌంట్ యూజ్ చేస్తున్నారని డౌట్ ఉంటే.. ఆండ్రాయిడ్ మొబైల్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అనంతరం 'మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. దీంట్లో 'సెక్యూరిటీ' సెక్షన్ సెలక్ట్ చేయాలి.
- తర్వాత ఆప్షన్లలో కిందకి స్క్రోల్ చేసి 'యువర్ డివైజెస్' సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- 'మేనేజ్ ఆల్ డివైజెస్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, ప్రస్తుతం గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన డివైజ్‌ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో అనాథరైజ్డ్, గుర్తు తెలియని డివైజ్‌లను గుర్తించాలి.
- తెలియని డివైజ్‌లు ఏవైనా లిస్ట్‌లో ఉంటే, దానిపై ట్యాప్ చేయండి. 'సైన్ అవుట్' బటన్‌పై క్లిక్ చేసి, గూగుల్ అకౌంట్ యాక్సెస్ రిమూవ్ చేయండి.
* గూగుల్ అకౌంట్ సెక్యూరిటీ ఎలా మెరుగుపరచాలి?
- పాస్‌వర్డ్ మార్చండి
తెలియని డివైజ్‌లో గూగుల్ అకౌంట్ యాక్సెస్ చేసినట్లు గుర్తిస్తే, వెంటనే సెట్టింగ్స్‌లో ఆ డివైజ్‌ను లాగౌట్ చేయండి. ఆ తర్వాత గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను కచ్చితంగా మార్చండి. నంబర్స్, లెటర్స్, సింబల్స్‌తో స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
- 2-స్టెప్ వెరిఫికేషన్
ఎక్స్‌ట్రా సెక్యూరిటీ లేయర్ యాడ్ చేయడానికి, 2-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ఎనేబుల్ చేయండి. సెక్యూరిటీ సెక్షన్‌లోనే ఈ ఫీచర్ కనిపిస్తుంది. 2-స్టెప్ వెరిఫికేషన్‌తో రిజిస్టర్డ్ పాస్‌వర్డ్ లేదా ప్రైమరీ డివైజ్‌కి సెండ్ చేసిన వెరిఫికేషన్ కోడ్ ఉపయోగించి లాగిన్ చేయవచ్చు.
- ట్రస్టెడ్ డివైజెస్
సైన్ ఇన్ చేసిన ప్రతిసారీ వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయకుండా ఉండటానికి, కంప్యూటర్ లేదా మొబైల్ డివైజ్‌ను ట్రస్టెడ్ డివైజెస్‌గా పేర్కొనవచ్చు. ఈ డివైజెస్‌ను ట్రస్టెడ్‌గా ఐడెంటిఫై చేస్తే, పదేపదే వెరిఫికేషన్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు.
COMMENTS