Vedant Lamba: Selling old shoes.. Earning Rs. Crores - The success story of a high school dropout
Vedant Lamba: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ
Vedant Lamba Success Story: మనిషి సక్సెస్ సాధించాలంటే చేసే పని మీద శ్రద్ద, ఎదగాలనే సంకల్పం రెండూ ఉండాలి. సక్సెస్ సాధించడమంటే ఒక రోజులో జరిగే పని కాదు.
నీ శ్రమ నిన్ను సక్సెస్ వైపుకు తీసుకెళుతుంది. పాత బూట్లను అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వేదాంత్ లంబా ఈ రోజు ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ ఇతడి సక్సెస్ సీక్రెట్ ఏంటి? కోట్లు ఎలా సంపాదించాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే మెయిన్‌స్ట్రీట్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన 'వేదాంత్ లంబా' తరువాత కాలంలో ఛానెల్‌ని మెయిన్‌స్ట్రీట్ మార్కెట్‌ప్లేస్ అనే పూర్తి స్టార్టప్‌గా అభివృద్ధి చేసాడు. కేవలం రూ. 20వేలతో ప్రారంభమైన అతని వ్యాపారం ఈ రోజు కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది.
వేదాంత్ 17 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు పాత బూట్లను విక్రయిస్తూ నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. లంబా స్కూల్‌లో ఉన్నప్పుడు స్నీకర్ల గురించి పెద్దగా తెలియదు. అయితే తన 16వ ఏట యూట్యూబ్ ఛానెల్ ద్వారా అవగాహన తెచ్చుకున్నాడు.
రూ. 100 కోట్లు లక్ష్యం
సంస్థ ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఏకంగా రూ. 7 కోట్ల రూపాయలు సంపాదించాడు. స్నీకర్స్ ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయని.. రానున్న రోజుల్లో కంపెనీ మరింత లాభాలను పొందుతుందని చెబుతున్నాడు. త్వరలో సంస్థ 100 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని వేదాంత్ లంబా అంటున్నాడు.
ప్రస్తుతం చిన్నవారికి ఎయిర్ జోర్డాన్ 1, యువతరం నైక్, లూయిస్ విట్టన్ ఎయిర్ ఫోర్స్ 1 వంటివి ఎక్కువగా ఇష్టపడతారని లంబా చెబుతున్నాడు. ఇతని కంపెనీ స్టోర్ న్యూ ఢిల్లీలో 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్నీకర్ రీసేల్ స్టోర్ కావడం గమనార్హం. హైస్కూల్ విద్యకే మంగళం పాడేసి బిజినెస్ స్టార్ట్ చేసిన లంబా కాలేజీ మెట్లు కూడా తొక్కలేదు. అయినప్పటికీ ఇప్పుడు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఉపాధి కూడా ఇస్తున్నాడు.
COMMENTS