Savings Tips: Eye-catching interest through recurring deposits.. which banks are giving? Do you know?
Savings Tips: రికరింగ్ డిపాజిట్ల ద్వారా కళ్లుచెదిరే వడ్డీ.. ఏయే బ్యాంకులు ఇస్తున్నాయో? తెలుసా?
రికరింగ్ డిపాజిట్ అంటే కస్టమర్లు ప్రతి నెలా తమకు నచ్చిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి, డబ్బును సులభంగా ఆదా చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతాలను భారతదేశంలోని చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు కాలపరిమితితో అందిస్తున్నాయి. మరోవైపు నమ్మకమైన రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మంచి ఎంపిక అయినప్పటికీ దీనిలో వ్యక్తులు నిర్దిష్ట కాలానికి కొంత మొత్తాన్ని ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుతో పెట్టుబడి పెడతారు.
ఎఫ్డీలు కాకుండా, రికరింగ్ డిపాజిట్ పెట్టుబడికి కూడా చాలా సురక్షితమైన ఎంపికగా హామీ ఇస్తున్నారు. ఈ డిపాజిట్లు ప్రమాద రహిత ఎంపికగా ఉంటాయి. అలాగే పెట్టిన పెట్టుబడిపై 10 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తాయి. అయితే ఈ వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. బ్యాంకులు 1 నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితితో రికరింగ్ డిపాజిట్లను అందిస్తాయి. చాలా బ్యాంకులు ఆర్డీలపై మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఆర్డీలపై 9.6 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల కాలపరిమితితో రికరింగ్ డిపాజిట్లపై 9.6 శాతం వడ్డీని పొందవచ్చు. అలాగే సాధారణ వినియోగదారులు దాదాపు 9.1 శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్ 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఆర్డీలపై సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్లు 5 సంవత్సరాల కాలపరిమితితో రికరింగ్ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఇతర కస్టమర్లు 1001-రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 9.1 శాతం, 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే ఆర్డీలపై 7.65 శాతం వడ్డీ రేటును పొందుతారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బ్యాంక్ 5 సంవత్సరాల కాలపరిమితితో రికరింగ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇతర కస్టమర్లకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఈ ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంకుల్లో 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఇతర కస్టమర్లు డిపాజిట్లపై 7 శాతం వడ్డీని పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్
ఈ బ్యాంకు ద్వారా సీనియర్ ఇన్వెస్టర్లు రికరింగ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఇతర కస్టమర్లు 5 సంవత్సరాల కాలవ్యవధితో ఆర్డీలపై 6.9 శాతం వడ్డీ రేటును పొందుతారు.
COMMENTS