PM Kisan New Rules: New rules in PM Kisan.. They are all ineligible, this scheme is not applicable!
PM Kisan New Rules: పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు!
మోదీ సర్కార్ రైతులకు అందిస్తున్న పథకాలలో ఒకటి పీఎం కిసాన్ యోజన స్కీం(Pradhan Mantri Kisan Samman Nidhi Yojana). ఈ పథకం కింద రైతులకు నేరుగా రూ. 6,000 నగదుని మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తోంది. అర్హులైన భూమి ఉన్న కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి 2000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది.
అయితే కొందరు అనర్హులైన రైతులు కూడా ఈ పథకం కింద రిజిష్టర్ చేసుకుని ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి పలు మార్పులు చేసింది. వాటి ప్రకారం అనర్హులు ఎవరంటే..
PM కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ దిగువ వ్యక్తులు పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కారు.
► అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు.
►కింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు
1. మాజీ, లేదా ప్రస్తుత రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నవారు
2. మాజీ, లేదా ప్రస్తుత మంత్రులు/ రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసన సభలు/ రాష్ట్ర శాసన మండలి మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు.
3. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్లు దాని ఫీల్డ్ యూనిట్లు సెంట్రల్ లేదా స్టేట్ పీఎస్‌యూలు, ప్రభుత్వ పరిధిలోని అటాచ్డ్ కార్యాలయాలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు.
4. అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV మినహా) సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు. ఉద్యోగులు /D గ్రూప్ ఉద్యోగులు) పై కేటగిరీలో నెలవారీ పెన్షన్ రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా) ఉన్న అన్ని పదవీ విరమణ పొందిన/రిటైర్డ్ పెన్షనర్లు
5. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నవారు.
COMMENTS