MRPL Recruitment: Jobs in central government sector organization.. per month Rs. Salary more than 80 thousand..
MRPL Recruitment: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకి పైగా జీతం..
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళూరులో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న నాన్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో నాన్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీలో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ను ఆఫ్‌లైన్ విధానంలో సబ్‌మిట్ చేయాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, మంగళూరు – 757030, కర్నాటక అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25000 నుంచి రూ. 86,400 వరకు జీతం చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 02-6-2023తో గడువు ముగియనుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS