ISRO: విద్యార్థులకు ఇస్రో బంపరాఫర్.. ఐఐఆర్‌ఎస్ నుంచి సర్టిఫికేట్ కోర్సు. ఆన్‌లైన్‌లో పూర్తిగా ఉచితం.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు సదవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోర్సు పొందే అవకాశాన్నిచ్చింది. ఇస్రోకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్), డెహ్రాడూన్ ఈ సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులో కేవలం విద్యార్థులే కాకుండా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థులకు సదవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోర్సు పొందే అవకాశాన్నిచ్చింది. ఇస్రోకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్), డెహ్రాడూన్ ఈ సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులో కేవలం విద్యార్థులే కాకుండా పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్ సిబ్బంది కూడా చేరొచ్చు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సింథటిక్ అపార్చుర్ రాడార్ డేటా ప్రాసెసింగ్‌లో సర్టిఫికేట్ అందిస్తారు.
ఈ కోర్సును పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కోర్సును ఏప్రిల్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒక్కో సెషన్ గంటన్నరపాటు సాగుతుంది. ఆన్‌లైన్ సెషన్ సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఉంటుంది. కోర్సులో పాల్గొనే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన టెక్నికల్/సైంటిఫిక్ సిబ్బంది/ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూ్షన్స్‌లోని పరిశోధకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇదిలా ఉంటే ఈ కోర్సులో చేరే వారికి రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌పై కనీస పరిజ్ఞానం ఉండాలి. కనీసం 70 వాతం హాజరు కలిగిన వారికి మాత్రమే సర్టిఫికేట్ అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇందులో చేరాలనుకునే సంస్థలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్లు సొంతంగా కో-ఆర్డినేటర్‌ను నియమించుకోవాలి. సదరు కో-ఆర్డినేటర్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS