HRA 2023
HRA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. హెచ్‌ఆర్‌ఏ నిబంధనల్లో కీలక మార్పులు..
HRA: ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను అవెన్సుల రూపంలో ప్రభుత్వం అందజేస్తోంది. వీటిలో ప్రధానంగా డీఏ, టీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటివి ఉంటాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెచ్‌ఆర్ఏ(ఇంటి అద్దె అలవెన్సు) నిబంధనల్లో మార్పులు చేసింది.
7th pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను అవెన్సుల రూపంలో ప్రభుత్వం అందజేస్తోంది. వీటిలో ప్రధానంగా డీఏ, టీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటివి ఉంటాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెచ్‌ఆర్ఏ(ఇంటి అద్దె అలవెన్సు) నిబంధనల్లో మార్పులు చేసింది. నిబంధనల సవరణకేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్(DoE) హెచ్‌ఆర్‌ఏ నిబంధనలను అప్‌డేట్ చేసింది.
ఈ రూల్స్ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగి హౌస్ రెంట్ అలవెన్సు పొందడానికి అర్హులు కాదు. ఒక ఉద్యోగి తనకు కేటాయించిన ప్రభుత్వ వసతిని మరో ప్రభుత్వ ఉద్యోగితో షేర్ చేసుకుంటే ఈ సందర్భంలో హెచ్‌ఆర్‌ఏ వర్తించదు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ రంగ సంస్థ, పాక్షిక- ప్రభుత్వ సంస్థలు(మున్సిపాలిటీ, పోర్ట్ ట్రస్ట్, జాతీయం చేసిన బ్యాంకులు, LIC) వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి తన తల్లిదండ్రులు/కొడుకు/కుమార్తెకి సంబంధించిన ఇంట్లో నివసిస్తుంటే కూడా హెచ్‌ఆర్‌ఏ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామికి పైన పేర్కొన్న ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తూ వసతి పొంది ఉంటే.. అందులో ఈ ఉద్యోగి ఉంటున్నారా? లేదా విడిగా అద్దెకు తీసుకున్నారా? అనే దాన్ని బట్టి హెచ్ఆర్‌ఏ అర్హతను నిర్ణయించనున్నారు.
అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులకు వసతికి సంబంధించిన ఖర్చుల కోసం అందించే హౌస్ రెంట్ అలవెన్సును X, Y, Z అనే మూడు రకాలుగా ఉంటుంది. X అనేది రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు వర్తిస్తుంది. సెవెన్త్ సెంట్రల్ పే కమిషన్(CPC) సిఫార్సు ప్రకారం ఈ సందర్భంలో HRA 24%గా ఉంటుంది. Y అనేది రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలకు సంబంధించింది. ఈ సందర్భంలో HRA 16%గా ఉంటుంది. Z అనేది రూ.5 లక్షల కంటే తక్కువ జనాభా ప్రాంతాలకు సంబంధించింది . ఈ సందర్భంలో 8% HRA ఇవ్వనున్నారు.
* డీఏ పెంపును బట్టి హెచ్ఆర్‌ఏ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ మెమోరాండం ప్రకారం.. కరువు భత్యం(DA) 25 శాతం దాటినపుడు, X, Y, Z క్లాస్ సిటీలకు హెచ్‌ఆర్‌ఏ రేట్లు వరుసగా 27 శాతం, 18 శాతం, 9 శాతానికి సవరించనున్నారు. ఒకవేళ డీఏ 50 శాతం దాటినప్పుడు హెచ్‌ఆర్‌ఏ వరుసగా 30 శాతం, 20 శాతం, 10 శాతానికి సవరించనున్నారు.
ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్‌న్యూస్ అందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్రం ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అన్ని గ్రూపులకు ఉమ్మడి ఫిట్‌మెంట్ ప్రయోజనం ప్రస్తుతం 2.57గా ఉంది. ప్రస్తుతం ఎవరైనా 4200 గ్రేడ్ పేలో రూ.15,500 బేసిక్ వేతనం పొందుతుంటే.. అతని మొత్తం వేతనం రూ.15,500×2.57= రూ.39,835గా ఉంటుంది. కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచనున్నట్లు సమాచారం. దీంతో జీతం 21000 X 3 = రూ. 63,000 అవుతుంది. సెవెన్త్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీ, ఫిట్‌మెంట్, అలవెన్సులు ఆధారంగా వారి వేతనం ఉండనుంది.
COMMENTS