APPRENTICESHIP RECRUITMENT AT RRC NWR 2023
Railway Jobs : రైల్వేలో 2026 జాబ్స్ ఈ అర్హతలుంటే చాలు.. అప్లయ్ చేసుకోగలరు.
నార్త్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023
2026 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన
జనవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Indian Railway Jobs :రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC)- నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://rrcjaipur.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 2026
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం- అజ్మేర్: 413
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం- బికనీర్: 423
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం- జైపూర్ డివిజన్: 494
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం- జోధ్‌పూర్ డివిజన్: 404
బీటీసీ క్యారేజ్- అజ్‌మేర్: 126
బీటీసీ లోకో- అజ్‌మేర్: 65
క్యారేజ్ వర్క్ షాప్- బికనీర్: 31
క్యారేజ్ వర్క్ షాప్- జోధ్‌పూర్: 70
ముఖ్య సమాచారం:
ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్ మిషెన్ టూల్ మేయింటనెన్స్, మెషినిస్ట్, తదితర ట్రేడుల్లో ఈఖాళీలున్నాయి.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 10.02.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:10.01.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2023
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS