Why do bike riders use Helmet?
హెల్మెట్" ఎందుకు వాడతారు?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
మొదట హెల్మెట్ ను ఆటలలో ఉదా: ఫుట్ బాల్ , హాకీ ఆటగా్ళ్ళు తలకు దెబ్బలు తగకుండా 19 వ శతాత్భం మొదటనుండే ఉపయోగించేవారు . కాలక్రమేనా అది మోటారు వాహన పందేలలో తలను కాపడేందుకు ముఖ్యము గా వాడడం మొదలు పెట్టేరు .
చరిత్రలో మొటార్ సైకిల్ ను 1885 లో " Gottlieb Daimler" అనే వ్యక్తి కనిపెట్టగా అది ఎన్నోవిధాలుగా మార్పులు చెంది నేటి అధునాతన మోటార్ బైక్ గా తయారైనది .
1931 -1953 సం.మధ్య కాలములో మోటారు సైకిల్ పందేలలో జరిగే ప్రమాదాలనుండి రక్షణ పొందేందుకు అమెరికా 'సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటి' ప్రొఫెషర్ " Red" Lombard ఆలోచనా ఫలితమే ఈ మోటార్ సైకిల్ హెల్మెట్ . 1953 లో పేటెంట్ హక్కులు పొందిన లొంబార్డ్ -- హెల్మెట్ ని ఎన్నో విధాలుగా డిజైన్‌లు మార్చి ప్రపంచానికి అందించారు .
-- భారతదేశం లో పురాతన రాజుల కాలమునుండే యుద్ధకాలములోనూ, సైనికులు , రాజులు తలను రక్షించుకునే నేపద్యములో హెల్మెట్ ను వాడేవారు . దీనిని ' శిరశ్రానము ' అనేవారు . రామాయణం , మహాభారతం లోనూ ఈ శిరశ్రాణం ధరించే ఆచారము , అవసరము అయిన చరిత్ర ఉన్నది . అనేక రకాల లోహాలతోనూ, చైన్‌ల తోనూ తయారుచేసేవారని ... కొంతమంది రాజులు బంగారము తోనూ తయారైనవి ధరించేవారని ప్రస్తావన ఉన్నది .
ఉపయోగాలు :
హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనం నడపడం చాలా మందికి నచ్చదు . జుట్టు చెరిగిపోతుందనో , తలకు ఉక్కపోస్తుందనో , వెంట్రుకలు పాడవుతాయనో , అదో శిరోభారం అనుకునో హెల్మెట్ ధారణకు " నో " చెప్పేస్తుంటారు . అది మంచి ఆలోచన కాదు .
శరీరంలోని అన్ని అవయవాలకంటే కూడా తలకు విశిష్టమైన స్థానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తలలో భద్రంగా ఉండే మెదడు అన్ని శరీర భాగాల చేత పని చేయిస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. ఏదేని ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలితే, తగిలిన చోట ఉన్న మెదడు కణాలు (న్యూరాన్లు) నశిస్తాయి.
శరీరంలో ఉన్న మిగతా కణాలకు, న్యూరాన్లకు స్వల్పమైన తేడా ఉంది. శరీరంలో నశించిన న్యూరాన్ల స్థానంలో కొత్తవి తయారు కావు, కానీ కణాలు మాత్రం కొత్తవి తయారవుతాయి. న్యూరాన్లు నశించటంతో అప్పటివరకూ ఆజమాయిషీ చేస్తోన్న అవయవాల పనితీరు దెబ్బతింటుంది.
దెబ్బ తీవ్రతను బట్టి కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడటం, జ్ఞాపకశక్తిని కోల్పోవటం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి... తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి టూవీలర్స్‌ను నడిపేవారు హెల్మెట్‌ను ధరిస్తారు. ఈ హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది.
మెదడుకు తగిలే గాయాలనుండే కాకుండా సెర్వైకల్ స్పైన్ గాయాలనుండి హెల్మెట్ రక్షిస్తుంది .
COMMENTS