Naag dosh : What is naag dosh .. How do those who get it behave .How to avoid it ?
నాగదోషం అంటే ఏంటి .. అది పట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారు .ఎలా నివారించాలి ?
నాగదేవత ఆగ్రహిస్తే.సర్పదోషం కలుగుతుంది. సర్పానికి తలను రాహు అని... తోకను కేతు అని పిలుస్తారు. రాహు ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటుంది, ఆకలితో ఉంటుంది, గందరగోళం చేస్తుంది... కేతు మాత్రం సమస్యల్ని అధిగమిస్తుంది, మోక్షం పొందుతుంది. చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఎవరైనా నాశనం చేస్తే... రాహుకు ఆగ్రహం వస్తుంది. పండితుల ప్రకారం సర్పాలకు అత్యంత ఎక్కువ శక్తి ఉంటుంది. అవి ప్రకృతి శక్తులను రక్షిస్తూ ఉంటాయి.
నాగదోషం పడితే ఏమవుతుంది
రాహు పట్టిన మహిళలు శుభ్రతను ఇష్టపడతారు. హై లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటారు. పెళ్లైన తర్వాత కూడా మగవాళ్లను ఆకర్షించాలి అనుకుంటారు. అదే కేతు పట్టిన మగవాళ్లైతే... స్వార్థంతో ఉంటారు. ప్రతి మహిళనూ మోసం చెయ్యాలని చూస్తారు. ప్రయాణాలు ఇష్టపడతారు.
కేతు పట్టిన మహిళలైతే.
స్వతంత్రంగా ఉంటారు, అన్నీ స్వయంగా చేసుకుంటారు. వారు తమ భాగస్వామిని త్వరగా కోల్పోతారు. అంటే విడాకులు ఇవ్వడం లేదా వితంతు అవ్వడం వంటివి జరుగుతాయి. కేతు పట్టిన మగవాళ్లైతే మతపరమైన, తత్వ భావనలతో ఉంటారు. తమ భాగస్వాములకు వారు మర్యాదగా, గౌరవసూచకంగా ఉండరు. వారు విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను ఆకర్షించేందుకు యత్నిస్తారు.
నాగదోషానికి కారణాలు?
అంత్యక్రియలు ఆలస్యంగా జరిగినా, అపరిచితుల ద్వారా జరిగినా ఈ దోషం చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అంత్యక్రియలప్పుడు చితిపై శరీరంలోని అన్ని అవయవాలూ కాలకపోతే ఈ దోషం రావచ్చు. వ్యక్తి ప్రమాదంలో, బాంబ్ దాడిలో చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, హత్య జరిగినా, విషం తాగి చనిపోయినా సర్ప దోషం పట్టుకునే వీలుంది. పూర్వీకులు పుట్టకముందే బిడ్డను చంపేస్తే అది కూడా సర్పదోషానికి దారితీస్తుంది. పూర్వం తమ తాలూకు వారు ఎవరైనా బాణామతి, చిల్లంగి లాంటివి చేసివుంటే ఇప్పుడు వీరికి సర్పదోషం పట్టుకుంటుంది.
నాగదోషం రాకుండా ఏం చెయ్యాలి?
విష్ణుమూర్తిని పూజించాలి. చండల యోగ నిర్వాణ పూజ చెయ్యాలి. అలాగే 11 ముఖాల రుద్రాక్ష మాల ధరించాలి. పసుపు రంగు మణి (yellow sapphire)ని ధరించాలి. గణపతిని పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివిటీ కోసం చండల గ్రహ శాంతి పూజ చెయ్యించాలి. అలాగే... తేనె, పసుపు, పసుపురంగు స్వీట్లను టీచర్లకు, బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. పేదలకు పసుపు రంగు వస్తువులు దానం చెయ్యాలి. పక్షులు, జంతువులకు ఆహారం పెట్టాలి. చంద్ర గ్రహ మంత్రం జపించాలి.
నాగదోషం ఎలా నివారించుకోవాలి?
సర్ప పరిహార పూజ చెయ్యించాలి. ఆ తర్వాత స్నానం చెయ్యాలి. మహాశివుణ్ని రోజూ పూజించాలి. శివలింగంపై నీరు, పాలు పొయ్యాలి. ఓం మనఃశివాయ అని 108 సార్లు రోజూ జపించాలి. నుదుటిపై చందనం రాసుకోవాలి. పంచముఖ సర్ప విగ్రహానికి ప్రతి మంగళవారం, శనివారం పూజ చెయ్యాలి. ఇలా 18 వారాలు చెయ్యాలి. ఇంట్లో నెమలి పించం ఉంచుకోవాలి. నాగపంచమి నాడు మహాభారతం చదవాలి. జ్యోతిష పండితుల సూచనలతో పంచ లోహాల ఉంగరం తొడగాలి. నవగ్రహ ఆలయాలు, రామేశ్వరం, కుంబకోణం లాంటి ఆలయాల్లో ప్రార్థనలు చెయ్యాలి. 42 బుధవారాలు... పప్పులను పేదలకు దానం చెయ్యాలి.
నాగదోషం ఉంటే ఏం చెయ్యకూడదు: నాగదోషం ఉంటే... ఉపవాస రోజుల్లో అంటే ఏకాదశి, శివరాత్రి, అష్టమి, గోగులాష్టమి రోజుల్లో ఏ పూజలు చెయ్యకూడదు. ఇంట్లో పూజ చెయ్యకూడదు. నాగ ఆలయాల్లో నమస్కారం పెట్టకూడదు. పూజ చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి. పీరియడ్స్ సమయాల్లో మహిళలైతే... నాగ ఆలయాల్లోకి వెళ్లకూడదు. మహిళల పీరయడ్స్ సమయాల్లో పూజలు చెయ్యకూడదు. గర్భిణీ అయిన స్త్రీలు నాగ ఆలయాలకు వెళ్లకూడదు. భోజనానికి ముందే పూజ చెయ్యాలి.
COMMENTS