DOUBLE THE MONEY
పోస్టాఫీసు లో ఉంచిన డబ్బుని రెట్టింపు చేసే స్కీమ్ . పూర్తి వివరాలు .
సాధారణంగా ప్రజలు తమ సంపాదించిన డబ్బుని పొదుపు చేసుకోవడానికి బ్యాంకులలో పోస్ట్ ఆఫీస్ లలో వివిధ రకాల స్కీములు ద్వారా డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు.
పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలు తమ డబ్బు దాచుకోవడమే కాకుండా దానికి రెట్టింపు పొందే అవకాశాలు కూడా పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఈ మేరకు
కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్ ద్వారా మీ డబ్బును డబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మీ డబ్బుకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ 10 సంవత్సరాల 4 నెలల్లో (124 నెలలు) రెట్టింపు అవుతుంది.
ఏ వయసు వారు అర్హులు :
ఈ పథకంలో చేరటానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ కిసాన్ వికాస్ స్కీమ్ లో రూ.1000 నుండి మీకు నచ్చినంత డబ్బు ఇన్వెష్ట్ చేసి కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఇక వడ్డీ రేట్ల కూడా మూడు నెలలకోసారి మారుతూ ఉండవచ్చు.
సింగిల్, జాయింట్‌లో ఖాతా తీయవచ్చు:
ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటే సింగిల్, జాయింట్‌ల అకౌంట్ ద్వారా ఖాతా తీయవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఒకవేళ పిల్లల పేరిట అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నామినీ గా ఉండాలి.
ఎలాంటి పత్రాలు కావాలి? :
ఈ స్కీమ్‌లో చేరాలంటే మొదటగా పోస్టాఫీసులో అకౌంట్ ఉండాలి. దాని కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి సర్టిఫికెట్స్ అందించి అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ఈ స్కీమ్‌లో నామినీ ఎంపిక కూడా ఉంటుంది.
డబ్బు తీసుకోవటం :
ఈ స్కీమ్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి మీ మొత్తం డబ్బు పొందవచ్చు. దీని కోసం లబ్దిదారుడు తన గుర్తింపు కార్డులతో పాటు, పథకానికి సంబంధించిన స్లిప్‌లు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్దిదారుడికి గుర్తింపు పత్రాలు లేకపోతే కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్‌ను తీసుకుని మీ పోస్టాఫీసు నుంచి మాత్రమే డబ్బు తీసుకోవలసి ఉంటుంది.
COMMENTS