A description of the sections of the Right to Information Act.
సమాచార హక్కు చట్టంలో ఏఏ సెక్షన్స్ ఉంటాయో వివరణ.
మనం ఏదైనా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే సమాచారం లేదు. ఇవ్వమని అధికారులు అంటున్నారా.? వారు సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి గారు IPC సెక్షన్స్ 166, 167, 217, 218, 219, 420, 406, 407 ప్రకారం నెరపరిదిలోకి వస్తారు. అందువలన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందే. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమీసనర్లు కూడా సమాచారం ఇవ్వని వారిని జైలుకు పంపవచ్చు. లేకుంటే 30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు.
మనం ఏదైనా సమాచారాన్ని అడగడానికి దరఖాస్తు ఫారం లేదా, కావలసిన సమాచారం తెల్లకాగితం పై రాసి ఐపీఓ ప్రజా సమాచార అధికారికి అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు. దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు.
సెక్షన్ 2 (ఎఫ్ ) ప్రకారం సమాచారం నిర్వచనం. కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మైయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడిలు, మొదలైనవి అడగవచ్చు. సెక్షన్ 2 (హెచ్) ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చేకార్యాలయలు ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలను అడగవచ్చు. సెక్షన్2(ఐ )ప్రకారం రికార్డు నిర్వచనం. సెక్షన్ 2(జె ) ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు. సెక్షన్2(జె )(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు ఒక గంటకు రూపాయలు 5 ఉంటుంది. సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు. సెక్షన్4(1)(ఏ ) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు పరిశీలించవచ్చు. సెక్షన్ 4(బి ) ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. సెక్షన్ 4(1)(సి ), (డి ) ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పనక్కర్లేదు. సెక్షన్4(2) ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం పొందవచ్చు. సెక్షన్4(4) ప్రకారం స్థానిక భాషలో సమాచారం ఇవ్వాలి.
సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజాసమాచార అధికారులు ఐపీఓ అప్పిలేట్ అధికారుల నియామకం చేయవచ్చు. సెక్షన్-6(1) ప్రకారం సమాచార హక్కు దాఖలు విధానం. సెక్షన్6(2) ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు. సెక్షన్ -6(3) ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ సమాచారం మరో కార్యాలయానికి పంపావలసిన బాద్యత అధికారులదే ఉంటుంది. సెక్షన్-7(1) ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వవలసిందే. అయితే వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి. ఒకవేళ ఐపీవో తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిషనర్ లేకుంటే డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.
COMMENTS