NITTTR Recruitment 2022
నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో టీచింగ్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరు..
భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్.. 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, మ్యాథ్స్, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేషనల్ మీడియా అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో టీచింగ్/రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 45 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నవంబర్ 28వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.1,31,400ల నుంచి రూ.2,04,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
The Director,
National Institute of Technical Teachers Training and Research (NITTTR),
Taramani, Chennai 600 113, Tamilnadu, India.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS