SSC CGL: ఈరోజు నుంచే SSC CGL 2022-23 అప్లికేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేయండి..
2022-2023 ఏడాదికి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL 2022-2023) ఎగ్జామ్‌కు దరఖాస్తులను ఆహ్వానించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission). ఈ పరీక్షకు అర్హులైన వారు నేటి నుంచి, అంటే సెప్టెంబర్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. టూ టైర్ బేసిస్‌లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సీజీఎల్ టైర్ 1లో అర్హత సాధించిన వారికి టైర్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తారు. సీజీఎల్ ఎగ్జామ్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీతో పాటు మహిళలకు దరఖాస్తు రుసుము లేదు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ (ssc.nic.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 10.
CGL ఎగ్జామ్ ప్యాటర్న్
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. SSC ఈ ఎగ్జామ్ ద్వారా అకడమిక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. పరీక్ష టూ టైర్స్‌లో ఉంటుంది. టైర్ 1 పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులూ ఉన్నాయి. ఒక్క నెగెటివ్ సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. ఇక ఈ పరీక్షలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
టైర్ 2 పరీక్షలో 800 మార్కులు ఉంటాయి. టైర్ 1 కంటే ఈ ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది. వ్యాసాలు, లేఖలతో పాటు అప్లికేషన్ రైటింగ్‌పైన ప్రశ్నలు ఉంటాయి. టైర్ 2 ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అన్ని దశల్లో టాప్‌లో నిలిచిన అభ్యర్ధులకు చివరిగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సీజీఎల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి ఆఫీసర్లుగా నియమిస్తారు.
డాక్యుమెంట్స్
రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. పదో తరగతితో పాటు పన్నెండో తరగతి సర్టిఫికెట్స్, గ్రాడ్యుయేషన్ మెమో సర్టిఫికెట్స్, కేటగిరీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, ఏదైనా గుర్తింపు కార్డు, సంతకం స్కాన్డ్ కాపీస్ అవసరం.
ఎలా అప్లై చేసుకోవాలి?
Step 1: అభ్యర్థులు వెబ్సైట్ హోమ్ పేజీలో నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 2: అక్కడ మీ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావాలి.
Step 3: అప్లికేషన్ పారంలో మీ పేరు, తండ్రి పేరు ఇతర వివరాలు సబ్మిట్ చేయాలి.
Step 4: ఇక ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
Step 5: అనంతరం అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
Step 6: భవిష్యత్తు అవసరాల కోసం ఈ అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి.
For Registration Link CLICKHERE
For Website CLICKHERE
COMMENTS