International Day of Action for Women health
ఈ రోజు ( May 28) "ఇంటర్నేషనల్ డే ఒఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్ " గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
నెలంతా హుషారుగా , ఆరోగ్యము గా చలాకీగానే ఉండే అనేకానేక మంది మహిళలు నెలలో మూడు నుండి ఏడు రోజులు పాటు మాత్రము ఏదో ఒకరకమైన ఇబ్బంది పెట్టే ఋఉతుక్రమము తో సతమతం అవుతున్నామని అంటుంటారు . ఋఉతుక్రమము లో శారీరక , మానసిక మార్పులు సహజము అని అందరూ గుర్తించాలి . జీవితము లో దైనందిన కార్యక్రమాలలో ఎదురయ్యే ఇబ్బందుల్ని , అనేక అంశాల్ని ఎదుర్కోడానికి , పరిష్కరించుకోవడానికి ఏవిదంగా అన్యితే ప్రయత్నిస్తారో అదేమాదిరి ఋతుక్రమ సమస్యలను ఎదుర్కోని పరిష్కరించు కోవడాన్ని తెలుసుకోవాలి . అలా మూలమూలన , వాడవాడల ఎలా పరిష్కరించుకోవాలో వాటిఅవస్యకత ఏమిటో తెలియజెప్పేందుకే ఈ " ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్ " ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము .
ఎందుకీ ఋతుక్రమము :
రజస్వల అయినప్పటినుంచి మెనోపాజ్ దశ వరకు నెలనెలా ఋతుస్రావము అయితేనే ఆరోగ్యము . గర్భసంచి లైనింగ్ (ఎండోమెట్రియం ) షెడ్డింగ్ వల్ల ఋతుస్రావము అవుతుంది . ఇది స్త్రీ సెక్ష్ హార్మొన్లు ( ఈస్ట్రోజం , ప్ర్రొజిస్టోన్ , లుటినైజింగ్ -యల్.ఎహ్ ) ప్రభావము , అధీనము లో జరుగుతూ ఉంటుంది . అండము విడుదళకు , ఋతుస్రావానికి కారణమవుతుంటాయి . సాధారణం గా ఋతుక్రమము 28 రోజులు ఒకసారి అయి ఋతుస్రావము 3 నుంచి 7 రోజులు అవుతూ ఉంటుంది . ఋతుస్రావము ఎర్రగా ఉన్నా , ముదురు ఎరుపు రంగులో ఉన్నా అలోచించాల్చిన పనిలేదు . ఇక రంగులలో తేడాను బట్టి శరీర ఆరోగ్య స్థితిని అంచనా వేయవలసి ఉంటుంది .
పి.ఎమ్.ఎస్. అంటే :
ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోం అని దీని పూర్తి నామము . కొంతమంది లో ఋతుక్రమము రావడానికి ముందు వంటిలో వేడి , కడుపులో నొప్పి , తలనొప్పి , కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉంటాయి . ఈ సమ్యము లో ఒత్తిడి , డిప్రషన్ కి లోనవుతారు ... ఈ పరిస్థితినే పి.యం.ఎస్ . అంటారు . ఇది హార్మోనుల సమతుల్యము లేకపోవడము వల్ల కలుగుతుంది . కొంతమందిలో ఈ లక్షణాలు ఋతుక్రమ సమయము లోనూ ఉంటాయి . సుమారు 3 - 4 రోజులు విశ్రాంతి తీసుకొని చిన్నపాటి వైద్యము తీసుకుంటే సరిపోతుంది .
కొంతమంది లో విపరీతమైన నొప్పి ఉంటుంది .. దీనిని " డిస్మెనూరియా " అంటాము .
కొంతమంది లో రక్తస్రావము ఎక్కువ అవుతూ ఉంటుంది . దీనిని " హైపర్ మెట్రేజియా " అంటాము .
కొంతమంది లో అసలు ఋతుస్రావము జరికీ జరగ నట్టే అతి తక్కువ బ్లీదింగ్ అవుతుంది .
వీటికన్నింటికీ తగిన కారణాలు తెలుసుకుని తగిన వైద్యము కోసము మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి .
గర్భిణీ కాలము లో స్త్రీలు ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు . సరియైన సమయము తగు వైద్యము తీసుకోవడం వలన ఆరోగ్యము చెడిఫోకుండా కాపాడుకోగలరు .
బాలింతరాలు బిడ్డలకు పాలు ఇచ్చుటవలన నీరసము , రక్తహీనతకు , లోనవుదురు . మంచి ఆహారము తీసుకోవాలి .
ఋతుక్రమము 45 - 50 సంవత్సరాల వయసు లో ఆగిపోవడానిని మెనోపాజ్ అంటాము . ఈ కాలము లో అనేక రుగ్మతలకు స్త్రీలు లోనవుతూ ఉంటారు .
ఈ విధము గా అనేక దశలలో అనేకానేక రుగ్మతలకు స్త్రీలు గురి అవుతూఉంటారు . ఏ వయసు వారికి ఆ సంభందిత ఆరోగ్య సూచనలు ఇవ్వడం , అవగాహన కల్పించడము , సహాయ సహకారాలు అందించడము మున్నగు పనులు ఈ రోజున వివిద ప్రబుత్వ , స్వచ్చంద సంస్థలు చేపట్టలనే ఉద్దేశము తో ప్రతిసంవత్సరము వుమెన్ హెల్త్ డే ని జరుపు కుంటున్నారు .
COMMENTS